అభిమానిని బలిగొన్న రాధేశ్యామ్ మూవీ.. బలవన్మరణం చేసుకున్న ఫ్యాన్..

పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ఒక ప్రభాస్ అభిమానిని బలిగొంది.ఇక ఈ సినిమా గురించి చెప్పుకుంటే సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది.

కానీ ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతుంది.ఇలా మిక్డ్స్ టాక్ రావడంతో కర్నూలులోని తిలక్ నగర్ లో ఉండే ప్రభాస్ అభిమాని రవితేజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.

వివరాల్లోకి వెళ్తే.గడిచిన మూడు సంవత్సరాల నుంచి ప్రభాస్ సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరోను ఎప్పుడు పెద్ద తెర మీద చూద్దామా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.వారి నిరీక్షణలకు తెర దించుతూ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించింది.ఇక ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది.

ఇది కర్నూలులో ఉండే రవితేజ అనే అభిమానికి నచ్చలేదు.రవితేజ కర్నూలులో మెకానిక్ పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు.

కాగా.రాధేశ్యామ్ మూవీని తన స్నేహితులతో కలిసి చూశాడు.

ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో తీవ్ర మనస్థాపం చెందాడు.సినిమాకు వెళ్లి వచ్చిన తర్వాత తన ఇంటిలో చూసుకుంటే ఎవరూ లేరు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)

రవితేజ తల్లి వేరే ఊరికి పోవడంతో ఇదే సరైన సమయం అనుకున్న రవితేజ తన ఇంటిలో ఉరేసుకుని జీవి విడిచాడు.ఇది తెలియని తన తల్లి రవితేజకు చాలా సార్లు ఫోన్ చేసింది.

Advertisement

అయినా కానీ రవితేజ నుంచి ఎటువంటి ఆన్సర్ లేదు.ఇక శనివారం ఉదయం తేజ స్నేహితులు ఇంటి తలుపులను ఎన్ని సార్లు తట్టినా కానీ ఎటువంటి స్పందనా లేదు.

దీంతో వారు తలుపులను కట్ చేసి చూడగా.రవితేజ మృతి చెంది కనిపించాడు.

తాజా వార్తలు