రాధేశ్యామ్ 12 నిముషాల కుదింపు.. మరింత ఇంట్రెస్ట్ పెంచుతున్న మేకర్స్..!

టాలీవుడ్ టాప్ హీరోల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకరు.ఈయన బాహుబలి సినిమాతో తన మార్కెట్ ను పాన్ ఇండియా లెవల్లో పెంచు కున్నాడు.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు.ప్రెసెంట్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేస్తూ వస్తున్నారు.

తమ అభిమాన హీరోను వెండి తెర మీద చూడక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.అందుకే రాధేశ్యామ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

ఇక ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కానున్నట్టు ఇటీవలే ప్రకటించారు.ఈ సినిమా కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసారని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రమోషన్స్ పరంగా వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేసింది.ఇక వీరు చేసే ప్రమోషన్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.

రిలీజ్ కు రెండు రోజులే సమయం ఉండడంతో వీలైనంత ప్రోమోట్ చేస్తూ రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.

తాజాగా ఈ సినిమా లో 12 నిముషాలు కుదిస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.ప్రెసెంట్ ఈ సినిమా నిడివి 138 నిముషాలు అని తెలుస్తుంది.ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ మంజూరు అయ్యింది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

మాములుగా ఈ సినిమా సెన్సార్ చేసినప్పుడు 150 నిముషాలు ఉండగా ఇప్పుడు టీమ్ స్వచ్చందంగా 12 నిముషాల సినిమాను కుదించడంతో ఇప్పుడు 2 గంటల 18 నిముషాలు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు