ఈ ముద్దుగుమ్మకి పెద్ద దర్శకులు కావాలంట

ఊహలు గుసగుసలాడే తో తెలుగు సినిమాకు పరిచయమై .కుర్రకారు ఊహల్లో విహరిస్తున్న సుందరి రాశి ఖన్నా .

చూడగానే ఆకట్టుకునే ఈ అందం ప్రస్తుతం చేతిలో మంచి చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది .అయితే రాశి ఇప్పటివరకు పని చేసిన దర్శకులంతా దాదాపు కొత్తవారే .మరి మన రాశికేమో పెద్ద దర్శకులతో పని చేయాలని ఉందట .ఇదే విషయాన్ని ఇలా పంచుకుంది ." నేను దాదాపు కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాను.శివమ్ దర్శకుడికి ఇది మొదటి సినిమానే.

చాలా క్లారిటీగా, కంఫర్ట్‌గా తీశారాయన.నాకు పెద్ద దర్శకులతో సినిమాలు చేయాలని ఉంది.

ఎవరు అవకాశం ఇచ్చినా కాదనను.తెలుగు పరిశ్రమలో నా స్థానం ఏంటి? అనే విషయం గురించి పెద్దగా ఆలోచించడంలేదు.మంచి అవకాశాలు వస్తున్నాయి.

Advertisement

అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను.పోటీ గురించి కూడా పట్టించుకోవడంలేదు.

ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలంటారు.ఆ విషయాన్ని నేను నమ్ముతాను.

నేను యాక్ట్ చేస్తున్న సినిమాలు సక్సెస్ అవ్వడంతో పాటు నాక్కూడా మంచి పేరొస్తోంది.సో.నా హార్డ్ వర్క్‌కి లక్ తోడైందని నమ్ముతున్నాను." .

అప్పులు చేసి చదువు.. ఒక్క మార్కుతో ఫెయిల్.. జోయా మీర్జా సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!
Advertisement

తాజా వార్తలు