సెలెబ్రెటీలు ఏది చేసినా విచిత్రంగానే ఉంటుంది.క్షణాల్లో అది వైరల్ అయిపోతుంది.
ఇప్పడు అందాల సుందరి కాజల్ అగర్వాల్ కూడా ఓ తమాషా పని చేసి వార్తల్లోకి ఎక్కింది.ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా లేకపోయినా ఫామ్ లో ఉంది.
ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి నటిస్తుంది కాజల్.తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని నఖోమ్ పాథోమ్ ప్రావిన్స్‌లో జరుగుతోంది.

ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా తమాషా వీడియో ఒకటి షేర్ చేశారు.అందులో హీరోయిన్ కాజల్ అగ్వర్వాల్ ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని కెమెరాకు ఫోజ్ ఇస్తున్న వీడియో సోషల్‌మీడియాలో షేర్ చేశారు.దాంతో అది కాస్త వైరల్ గా మారింది.