టీడీపీ నాయకులపై .ఆ పార్టీకి ఆర్ధిక అండదండలు అందిస్తున్న వారిపై బీజేపీ డేగ కన్ను వేసినట్టు కనిపిస్తోంది.
అందుకే ఏపీలో ప్రముఖ నాయకుల ఆర్ధిక లావాదేవీలపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటోంది.మంత్రుల ఆస్తులపై ఐటీ దాడులు జరగబోతున్నాయి అని ఏపీ సీఎం చెప్పిన రోజే ఈ దాడులు జరగడం గమనార్హం.

నెల్లూరు జిల్లా టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు వ్యాపార సంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.ఆక్వారంగ వ్యాపారంలో బిగ్ షాట్ గా పేరున్న బీద మస్తాన్ రావు రొయ్యలు, రొయ్య పిల్లలు, విదేశాలకు ఎగుమతి వ్యాపారం చేస్తున్నారు.చెన్నై, నెల్లూరు కార్యాలయలు, కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం దామవరం విమానాశ్రయం భూములు వద్ద ఉన్న ఫ్యాక్టరీలపై కూడా ఐటీ అధికారుల సోదాలు చేశారు.
బృందాలు విడిపోయిన అధికారులు ఏకకాలంలో ఆరు చోట్ల తనిఖీలు చేశారు.
మస్తాన్ రావుకి చెందిన బీఎమ్ఆర్ వ్యాపార సంస్థలో కూడా సోదాలు చేశారు.ఇప్పటికే పలు కీలక రికార్డులు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
జిల్లా టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర బీఎమ్ఆర్ సంస్థల్లో భాగస్వామి.ఈ దాడుల వెనుక రాజకీయం హస్తం ఉందని కేంద్రం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.






