ఈ కాలంలో పిల్లలకు అస్సలు చెప్పలేకపోతున్నాం .వాళ్ళు ఏది అడిగినా వెంటనే ఇచ్చేయ్యాల్సిందే లేకపోతే ఇల్లు పీకి పందిరి వేస్తారు ! అనే డైలాగులు ప్రతి ఇంట్లోనూ వినిపిస్తుంటాయి.
అవును నిజమే ఇప్పుడు రోజులను బట్టి పిల్లలు ఏది అడిగిన ఇవ్వాల్సిందే లేకపోతే ఆ తరువాత పరిణామాలకు కూడా సిద్ధంగా ఉండాల్సిందే అన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లో రూ.2 ఇవ్వలేదని 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.మదన్‌పురాలో చంద్రఖాన్ అనే బాలుడు తల్లిని ఛాయ్, బిస్కట్ అడుగగా…ఛాయ్ మాత్రం ఇచ్చి బిస్కట్ లేదని చెప్పింది.దీంతో రూ.2 ఇవ్వాలని మొండికేయగా కోపంతో తల్లి అతడిని దండించింది.అనంతరం తల్లి చున్నీ తీసుకుని స్కూల్‌కు బయలుదేరిన బాలుడు ఇంటికి తిరిగి రాలేదు.సాయంత్రం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు.తన కొడుకుని చూసిన తల్లి భోరుమని విలపించింది.






