రాజకీయ యుద్ధం మొదలయిపోయింది .ఇక నుంచి రాజకీయ కక్షలు ఊపందుకుంటాయి.
తమకు గిట్టని పార్టీ నేతలపై కేసులు నమోదవ్వడం ఇవన్నీ షరా మామూలుగానే జరిగిపోతుంటాయి.ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎదుర్కొనేలా కనిపిస్తోంది.
కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఏపీ అధికార పార్టీ నాయకుల మీద ఏదో ఒకరకంగా కక్ష తీరుచుకునేలా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వాక్యాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

ఏపీలోని పలువురు మంత్రులపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.బుధవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో జరగాల్సిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాయిదా పడిన తర్వాత ఆయన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు.ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ మంత్రుల మీద ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని ఆయన మంత్రులను హెచ్చరించినట్టు తెలుస్తోంది.చంద్రబాబు ప్రధాని కావాలంటూ మంత్రులు ఎక్కడా వ్యాఖ్యలు చేయవద్దని సీఎం స్పష్టంచేశారు.