సౌదీ సరికొత్త వీసా 'షరెక్‌'

సౌదీ వెళ్ళాలి అంటే అక్కడ పనిచేయడానికి వెళ్ళాలి లేదా.అక్కడ పుణ్య క్షేత్రాల దర్శనానికి వెళ్ళాలి.

 Saudi Arabia Launches New Visa Process For Sports Fans-TeluguStop.com

ఇలా ఈ రెండు కారణాలని దృష్టిలో పెట్టుకుని సౌదీ ప్రభుత్వం వీసాలని మంజూరు చేస్తుంది అయితే పర్యాటకుల కోసం సౌదీ తన నిబంధనల్ని సడలిస్తోంది.అందుకోసం ప్రత్యేక వీసాలని ప్రవేశ పెట్టింది.

ఈ వీసాల ద్వారా పర్యాటకులు మొత్తం దేశం లో ఎక్కడికైనా తిరిగేయచ్చు అంటూ కొన్ని నిబంధలని పెడుతూ సరికొత్త వీసా ప్రవేశ పెట్టింది.

ఆ వీసా పేరు “షరెక్‌”.సౌదీ లో ఉన్న కింగ్‌డమ్‌ టవర్‌, రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ మ్యూజియం.ఇలా ఆ దేశంలో చూడటానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి.

సంగీత విభావరులు, రేసింగ్‌, ఫుట్‌బాల్‌ లాంటి క్రీడా వేడుకలకు హాజరయ్యే అభిమానుల కోసం తొలిసారిగా ప్రత్యేకంగా ఈ-వీసా జారీ చేయనుంది సౌదీ ప్రభుత్వం.పర్యాటక రంగాల్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ఈ-వీసా ఉపయోగపడుతుందని సౌదీ భావిస్తోందని అక్కడ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.

ఈ వీసాని ఎలా దరఖాస్తు చేయాలి అంటే.

ఈ వీసాతో సౌదీలో ఎక్కడికైనా వెళ్లే అనుమతి ఉంటుంది.ఎలాంటి నిబంధనలూ ఉండవు.దీని ఖరీదు 170 డాలర్లు ( సుమారు రూ.13 వేలు).దీనికి కోసం ఎంబసీల చుట్టూ తిరగాల్సిన పని లేదు.

ఆన్‌లైన్‌లో మీ వ్యక్తిగత వివరాలు, పాస్‌పోర్టు కాపీని, పాస్‌పోర్టు ఫొటోను విదేశీ వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్‌లోడ్‌ చేసి.ఈ-వీసా రుసుము చెల్లిస్తే చాలు.అన్ని వివరాలు పరిశీలించి, ఈ-వీసాను మీ మెయిల్‌కి పంపిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube