Allu arjun: అల్లు అర్జున్ మొదటి జీతం.. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

తెలుగు సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్( Allu arjun ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తాజాగా జాతీయ ఉత్తమ నటుడిగా కూడా అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.దీంతో అల్లు ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు అల్లు అర్జున్ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ సందడి సందడి చేస్తున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మొదటి సంపాదన గురించి అలాగే అల్లు అర్జున్ కు ఉన్న ఆస్తుల గురించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఆ వివరాల్లోకి వెళితే.అల్లు అర్జున్ ను మొదట గంగోత్రి సినిమాతో( Gangotri ) హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

ఈ సినిమా కంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా చిరంజీవి నటించిన డాడీ అలాగే మరో సినిమాలో నటించారు.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 21 ఏళ్ల వయసులో గంగోత్రి సినిమాతో హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.

అయితే అల్లు అర్జున్ మొదటి జీతం కేవలం 3500 మాత్రమే.కానీ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.అల్లు అర్జున్ ఆస్తులు విషయానికి వస్తే.అల్లు అర్జున్‌ ఆస్తుల నికర విలువ సుమారు రూ.410 కోట్లు.ఒక్కో సినిమాకు ఆయన రెమ్యూనరేషన్‌ కూడా 40 నుంచి 50 కోట్ల వరకు అందుకుంటున్నట్టు తెలుస్తోంది.

అలాగే ఆయన దగ్గర లక్షలు విలువ చేసే ఖరీదైన ఫోన్లు వాచ్లు వంటివి కూడా ఉన్నాయి.అలాగే పార్లే ఆగ్రోఫ్రూటీ, రెడ్ బస్, కోల్గేట్ మాక్స్ ఫ్రెష్, లాట్ మొబైల్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.ఒక్కో బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌కు విషయంలోనూ ఆయన కోట్లలో పారితోషకం అందుకుంటున్నారు.

అల్లు అర్జున్ కి కార్లు అంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే.రేంజ్ రోవర్ వోగ్ కారును రూ.2.50 కోట్లు, వానిటీ వ్యాన్‌ రూ.7 కోట్లు, బీఎండబ్ల్యూ ఎక్స్‌ 5 రూ.80 లక్షలు, జాగ్వార్ ఎక్స్‌జేఎల్‌ రూ.1.20 కోట్లు, ఆడి ఏ7 రూ.86 కోట్ల వెచ్చించి కొనుగోలు చేశారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

వీటితో పాటు ఇంకా ఖరీదైనవి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.కేవలం ఇవి మాత్రమే కాకుండా హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌కు పలు వ్యాపారాలు సైతం ఉన్నాయి.సినిమా థియేటర్లు, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.రూ.100 కోట్ల ఖరీదైన భవనం ఉంది.ఉదయపూర్‌లో నిహారిక కొణిదెల( Niharika Konidela ) డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వెళుతున్నప్పుడు అతను తన జెట్ ఫోటోగ్రాఫ్‌లను పోస్ట్ చేశాడు.

Advertisement

దీంతో పాటు నార్సింగిలోని అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్, ఆశీర్వాదం, జూబ్లీహిల్స్‌ లో విలాసవంతమైన భవనం కొనుగోలు చేశారు.మొత్తానికి అల్లు అర్జున్ వద్ద ఉన్న ఖరీదైన బహుమతులు అన్ని విలువ చేసుకుంటే దాదాపు 600 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు