టాలీవుడ్ హీరో శర్వానంద్( Sharwanand ) గురించి మనందరికీ తెలిసిందే.టాలీవుడ్ లో హీరోగా పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు శర్వానంద్.
అయితే వరసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ చెప్పుకోదగ్గ సరైన హిట్ ఒక్కటి కూడా పడడం లేదు.సరైన హిట్ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు శర్వానంద్.
ఇకపోతే ఇటీవలె బేబీ ఆన్ బోర్డు( Baby on board ) అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో పాటు చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ ఏడాదే శర్వానంద్ ఒక ఇంటివాడైన విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత కథలను ఎంచుకునే విధానంలో శర్వా చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో శర్వానంద్ కు సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొట్టడంతో ఆ వార్తలు విన్న శర్వానంద్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.అదేంటంటే ఒక సర్జరీ కోసం అమెరికా వెళ్ళినట్లు తెలుస్తోంది.
అందుతుంది.జాను సినిమా( Jaanu movie ) సమయంలో శర్వానంద్ కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదం వలన ఆయన మరింత బరువు పెరిగాడు.ఇక ఈ ప్రమాదంలో దెబ్బలు కూడా గట్టిగా తగిలాయని శర్వా చెప్పుకొచ్చాడు.
ఇక అప్పుడు సంబంధించిన గాయాలు మానినా కొన్ని నొప్పులు అలాగే ఉన్నాయని తెలుస్తోంది.
అందుకే దానికోసం అమెరికాలో ఒక సర్జరీ చేయించుకోవడానికి శర్వానంద్ వెళ్ళినట్లు తెలుస్తోంది.ఆయన తిరిగి రాగానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నాడని సమాచారం.ఈ విషయం తెలియడంతో అభిమానులు శర్వా సర్జరీ సక్సెస్ అవ్వాలని, ఆయన త్వరగా కోలుకొని సెట్లో అడుగు పెట్టాలని కామెంట్స్ పెడుతున్నారు.
మరి ఈ సినిమాలతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి మరి.ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో శర్వానంద్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.శర్వానంద్ తొందరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.