అల్లు అర్జున్ హీరో గా పుష్ప సినిమా తెరకెక్కింది.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ను హిందీలో విడుదల చేయడం లేదు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అక్కడి బయర్లు మరియు డిస్ట్రబ్యూటర్లు సినిమా విడుదలకు కొన్ని అడ్డంకులు సృష్టించారనే వార్తలు వస్తున్నాయి.దాంతో చిత్ర యూనిట్ సభ్యులు హిందీ వర్షన్ లో సినిమాను విడుదల చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పుష్ప సినిమా నుండి కొందరు బాలీవుడ్ వర్గాల వారితో చర్చించి సమస్య పరిష్కారంకు దారి చూపించినట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అనుకున్న ప్రకారం వచ్చే నెలలో సినిమాను సౌత్ తో పాటు హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
పుష్ప సినిమా తో మొదటి సారి అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు బాలీవుడ్ లో ఆయన స్థాయిని యూట్యూబ్ ద్వారా నిలిపాయి.
మొదటి సారి థియేటర్ల ద్వారా సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను రూపొందించాడు.
సినిమా చిత్రీకరణ సమయంలో కరోనా వల్ల కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి.

వాటన్నింటిని ఎదుర్కొని దాదాపు రెండేళ్ల పాటు ఆ లుక్ కోసం బన్నీ గడ్డం మరియు జుట్టు పెంచుకున్నాడు.ఎట్టకేలకు సినిమా చిత్రీకరణ ముగిసిన నేపథ్యంలో ఆయన నార్మల్ లుక్ కు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.పుష్ప సినిమా హిందీ లో విడుదల చేయాలని అక్కడి బన్నీ అభిమానులు చేసిన పోరాటం సఫలం అయ్యింది.
ఇది ఖచ్చితం గా బన్నీ అభిమానులకు పెద్ద గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.