Puri Jagannadh Ravi Teja : పూరీకి స్టార్ హీరో దొరికాడా.. ఇండస్ట్రీలో కొత్త గుసగుసలు!

పూరీ జగన్నాథ్ అంటేనే మాస్ ఆడియెన్స్ ను తన డైలాగ్స్ తో మెప్పిస్తాడు.

ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

టాలీవుడ్ లోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన ఈయనకు ఇప్పుడు మాత్రం గడ్డు కాలం ఎదురైంది అనే చెప్పాలి.ఎందుకంటే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించగా.రిలీజ్ అయినా అన్ని చోట్ల ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని పూరీ రెండేళ్లకు పైగానే కష్టపడ్డాడు.కానీ ఈ సినిమా అందరి ఆశలను తల్లక్రిందులు చేసింది.

Advertisement

ఇదే పెద్ద షాక్ అంటే ఈ సినిమా నిర్మాతల మీద మనీ లాండరింగ్ కేసు నమోదు అవ్వడంతో పెద్ద తలనొప్పి అయిపొయింది.ఇలా పూరీ ప్రెజెంట్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు.

నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు కానీ తన నెక్స్ట్ సినిమా గురించి మాత్రం విపరీతమైన చర్చ జరుగుతుంది.ఈయన ఇంకా తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు.

కానీ ఈయన వారితో చేయబోతున్నాడు.వీరితో చేయబోతున్నాడు అనే కథనాలు మాత్రం వినిపిస్తున్నాయి.

పూరీ తన కొడుకు ఆకాష్ తో చేయబోతున్నాడు అని.అలాగే చిరంజీవితో చేయబోతున్నాడు అని గుసగుసలు వినిపించాయి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇక ఇప్పుడు ఈ లిష్టులో మరొకరి పేరు వినిపిస్తుంది.ఆయన మరెవరో కాదు.మాస్ మహారాజా రవితేజ.

Advertisement

పూరీ-రవితేజ కాంబోలో చాలా సినిమాలు తెరకెక్కాయి.ఇప్పుడు రవితేజ స్టార్ హీరోగా ఎదిగాడు అంటే ఖచ్చితంగా పూరీ సినిమాలు కూడా ఒక రీజన్ అనే చెప్పవచ్చు.

మరి ఇప్పుడు కూడా పూరీ రవితేజతో ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడట.ఇప్పటికే సంప్రదింపులు జరుపగా త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

చూడాలి మరి మాస్ రాజా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో.

తాజా వార్తలు