పూర్తి పారదర్శకంగా ఆంబులెన్స్ కొనుగోలు.. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు

శ్రీకాకుళం,మే,23 : సంచార పశు వైద్యశాల వాహనాల (ఆంబులెన్సులు) కొనుగోలు పూర్తి పారదర్శకంగా జరిగిందని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.సోమవారం ఆయన శ్రీకాకుళం రహదారులు భవనాల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశు సేవలు అందించే నిమిత్తం ఆంబులెన్స్ లు కొనుగోలుకు ఎపిడిడిసిఎఫ్ మేనేజింగ్ డైరక్టర్ అధ్యక్షులుగాను, మత్య్సశాఖ, రవాణా శాఖ కమీషనర్లు సభ్యులుగాను, పశు సంవర్థక శాఖ జాయింట్ డైరక్టర్ పిపిపి ఎక్స్పర్ట్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్, పశు సంవర్థక శాఖ సంచాలకులు సభ్యులగాను టెండర్ ఎవాల్యూయేషన్ కమిటీ నియమిస్తూ పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది పేర్కొన్నారు.

జాతీయ స్థాయిలో ఇ-ప్రొక్యూర్ మెంట్ ప్లాట్ఫారం ద్వారా టెండర్లు పిలిచి రివర్స్ టెండరింగ్ పద్దతి అనుసరిస్తూ ఒక్కో వాహనంనకు రూ.28,17,417.15(జియస్టి అదనం) చొప్పున 175 వాహనాలు కొనుగోలు చేయుటకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నాకరు.ఎల్-1 గా ఎంపిక చేయబడిన టాటా మోటార్స్ లిమిటెడ్, ముంబై వారు ఒక్కొక్క వాహనంనకు రూ.32,19,905.40(జియస్టి అదనం) కొటేషన్లు వేయగా రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక్కొక్క వాహనం రూ.28,17,417.15 (జియస్టి అదనం) చొప్పున సరఫరా చేయుటకు విజయవంతంగా బిడ్డర్ గా టెండర్ ఎవెల్యూయేషన్ కమిటీ ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.టాటా మోటార్స్ లిమిటెడ్, ముంబై వారికి జియస్టి తో కలుపుకొని ఒక్కొక్క వాహనం రూ.33,24,562.24 సరఫరా చేయుటకు ఎల్.ఒ.ఎ.జారీ చేసినట్లు చెప్పారు.టాటా మోటారు లిమిటెడ్, ముంబై వారికి వాహనం కొనుగోలుకు, హైడ్రాలిక్ లిఫ్ట్, తదితర అదనపు ఎక్వీప్ మెంట్ వాహనంతో పాటు సరఫరా చేయుటకు 175 వాహనాలు రూ.58.18 కోట్ల తో కొనుగోలు చేయడం జరిగిందని, ఒక్క రూపాయి కూడా చెల్లింపు జరగలేదన్నారు.175 వాహనాలకు రెండు సంవత్సరాలకు ఆపరేషన్, మెంటెనెన్స్ కొరకు ఇ-ప్రొక్యూర్ మెంట్ ద్వారా జాతీయ స్థాయిలో టెండర్లు పిలుచుటకు రూ.79.80 కోట్ల తో పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.ఎపిడిడిసిఎఫ్ మేనేజింగ్ డైరక్టర్ అధ్యక్షులుగాను, మత్య్సశాఖ, రవాణా శాఖ కమీషనర్లు సభ్యులుగాను, పశు సంవర్థక శాఖ జాయింట్ డైరక్టర్ పిపిపి ఎక్స్పర్ట్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్, పశు సంవర్థక శాఖ సంచాలకులు సభ్యులుగా టెండర్ ఎవాల్యూయేషన్ కమిటీ టెండర్లను పిలచి ఎల్-1 గా ఎంపిక చేయబడిన జివికె – ఇఎంఆర్ఐ, సికింద్రాబాద్ వారు ఒక్కొక్క వాహనంనకు నెలకు రూ.1,85,400.00 కొటేషన్ వేయగా రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక్కొక్క వాహనంనకు నెలకు రూ.1,67,787.00 చొప్పున ఒ అండ్ ఎం కొరకు విజయవంతమైన బిడ్డర్ గా టెండర్ ఎవెల్యూషన్ కమిటీ ఎంపిక చేయడం జరిగిందని వివరింగచారు.ఒక్కొక్క వాహనంనకు నెలకు రూ.1,67,787.00 చొప్పున ఎల్.ఓ.ఎ.జారీ చేసినట్లు పేర్కొన్నారు.

సంచార పశు వైద్యశాల వాహనాలలో చికిత్స నిమిత్తం పశువుని ఎక్కించి సంబంధిత యజమానిని కూర్చోని వాహనంలో ప్రయాణించు సదుపాయం కూడా అందులోనే ఉంటుందని, పశువు యొక్క ఆలనను చూసుకొనే సౌకర్యం ఉంటుందని చెప్పారు.గ్రామీణ ప్రాంతంలోని సమస్యలు తెలుసుకొని ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.సంచార పశు వైద్యశాల వాహనాల వలన రైతు ముంగిటే అన్ని మారుమూల గ్రామాలకు పశు వైద్యశాలలు అందుబాటుతలో లేని గ్రామాలకు మెరుగైన పశు వైద్య సేవలు, పశు వ్యాధుల నిర్దారణ సేవలు నిర్దేశిత తేదీలలోనుఅత్యవసర పరిస్థితుల్లోను నాణ్యమైన పశు వైద్య సేవలు అర్హత గల పశు వైద్యులు అందుబాటులో ఉంటారని వివరించారు.

ఈ వాహనములో 5 రకాల పరీక్షలు, 75 రకాలు శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు 81 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు.వైద్యం నిమిత్తం పశువును ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం పూర్తి అయిన తర్వాత ఇంటికి కూడా వాహనంలోనే చేర్చడం జరుగుతుందని చెప్పారు.

పశువులకు అత్యవసర వైద్యం నిమిత్తం 1962 కాల్ సెంటర్ ఫోన్ కాల్స్ వస్తే తక్షణమే వైద్యులను పంపించి వైద్యం చేయించేందుకు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.ఈ వాహనాలతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం మనుష్యులకే వైద్యం కాకుండా పశువులకు వైద్యం అందించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Advertisement

ఈ సమావేశంలో కళింగ వైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు, తూర్పు కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు తాతబాబు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు