పవన్ కళ్యాణ్ సినిమాలో అలాంటి పాత్రలో కనిపించనున్న పునర్నవి

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన తెలుగు ముద్దుగుమ్మ పునర్నవి భూపాళం.

ఈ అమ్మడు తరువాత చేసిన సినిమాలు ఏంటి అనేది పెద్దగా ఎవరికీ తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ 3 లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో అందరికి చేరువ అయిపొయింది.

నిజంగానే వీరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుంది అనుకునేంతగా జీవించేశారు.దీంతో వీరు బయటకి వచ్చాక కూడా రాహుల్ ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.

అయితే అదంతా షో కోసం మాత్రమే అని తమ ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ లేదని, తాను వేరొక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు పునర్నవి క్లారిటీ ఇచ్చింది.ఇక బిగ్ బాస్ తర్వాత ఈ భామ కాస్తా గ్లామర్ డోస్ పెంచి ఫోటోషూట్ లు చేసుకుంటుంది.

మళ్ళీ కెరియర్ లో బిల్డ్ చేసుకోవాలని అనుకుంటుంది.అందులో భాగంగా తనకున్న పరిచయాలతో స్టార్ దర్శకులని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది.

Advertisement

ఈ నేపధ్యంలో పునర్నవికి అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తో క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీగా అవకాశం ఇచ్చినట్లు సమాచారం.ఈ సినిమాలో ఆమె ఓ పల్లెటూరిలో ఉండే దేవదాసిని పాత్రలో కనిపించనుందని, సినిమాలో ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉండటంతో చేయడానికి ఒకే చెప్పినట్లు టాక్ నడుస్తుంది.

అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ కన్ఫర్మ్ చేయలేదు.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి లేదంటే పునర్నవి నుంచి క్లారిటీ రావాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు