వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ప్రజా భద్రత చర్యలు తప్పనిసరి

తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ లో భాగంగా 100 మంది కన్నా ఎక్కువ జనసంచారం ఉండే సంస్థల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan )రాజన్న సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్సెంనెట్ యాక్ట్ లో భాగంగా రోజు వారిలో 100 మంది కన్నా ఎక్కువ జనసంచారం ఉండే వ్యాపార, వాణిజ్య సంస్థల్లో(కమర్షియల్ భవనాలు,షాపింగ్ మాల్స్,ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్,మొదలగు.

)సీసీ కెమెరాలు తప్పని సారిగా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.నేరాల పరిశోధనలో,అనుకోని సంఘటనలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు( CC cameras ) కీలకంగా వ్యవహరిస్తాయి అని,సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో రోజు వారిలో భాగంగా 100 మంది కన్నా ఎక్కువ జనసంచారం ఉండే వ్యాపార ,వాణిజ్య సంస్థల్లో ప్రజా భద్రత చర్యలు తప్పనిసరిగా పాటించాలని, తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎంఫైర్స్మెంట్ యాక్ట్ లో భాగంగా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఈ నెల జనవరి 27 తేదీ లోపు లోపు ఏర్పాటు చేయలని, 27 తేదీ తరువాత వాటి పరిధిలో ఉన్న ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి తనిఖీ చేసిన సమయంలో సీసీ కెమెరాల లేకున్నా, పని చేయకున్న సంబంధిత యజమాని పై తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎంఫైర్స్మెంట్ యాక్ట్( Telangana Public Safety Enforcement Act ) ప్రకారం చర్యలు తీసుకువడం జరుగుతుదాని ఎస్పీ తెలిపారు.

క్యాబినెట్ భేటీ లో కీలక నిర్ణయం ... మహిళలకు పండుగే 

Latest Rajanna Sircilla News