ప్రజాస్వామ్య విలువలను కాపాడండి

సూర్యాపేట జిల్లా:కోదాడ అసెంబ్లీ ఎన్నిక( Kodada Assembly Election ) ప్రజాస్వామ్య విలువలతో జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోదాడ ఆర్డీవో,రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణను పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మినారాయణ కోరారు.

సోమవారం ఆర్డీఓ ఆఫిస్ లో ఆయనకు వినతిపత్రం అందించారు.

డబ్బు, మద్యం ఇతర తాయిలాలతో ఓటర్లను మభ్యపెట్టే అభ్యర్థుల, నాయకుల,అనుచరులపై నిరంతరం నిఘా పెట్టాలని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం ఆర్ఓకు మొక్కను బహుకరించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లడుతూ ప్రజాస్వామ్య విలువలతో తమ ఓటును వినియోగించుకుని,ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత ఓటర్లదేని సూచించారు.ఎన్నికల నిబంధనలు సక్రమంగా అమలు చేస్తామని చెప్పారు.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

Latest Rajanna Sircilla News