స‌లహాదారు స‌జ్జ‌ల‌తోనే ప్రాబ్ల‌మ్.. అన‌వ‌స‌రంగా అలాంటి కామెంట్స్‌..?

రాజు రాసిందే శాస‌నం.మంత్రి చెప్పిందే వేదం.

సైనికులు వారి అడుగు జాడ ల్లో న‌డ‌వాలి.ఏదైనా యుద్ధం వ‌స్తే రాజే జోక్యం చేసుకుని దిశానిర్ధేషం చేస్తారు.

కానీ, సైనికులు అవివేకంగా త‌ల‌దూరిస్తే అది అగ్గిరాజుకోవ‌డం ఖాయం.ఇదే ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం ఎదుర్కొంటోంది.

పీఆర్‌సీ విష‌యంలో ఉద్యోగులు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య వివాదం క‌న‌సాగుతోంది.ఇందులోకి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌ల‌దూర్చి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డంతో స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేస్తున్నాయి.

Advertisement

ఇదే విష‌యాన్ని ఉద్యోగులు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.దీనికి తోడు వైసీపీ నాయ‌చ‌కులు కూడా పెద‌వి విరుస్తున్నారు.

ఉద్యోగుల ప‌ట్ల ఆయ‌న తీరుపై త‌ప్పుబ‌డుతున్నారు.ఏకంగా సీనియ‌ర్ నాయ‌కులే స‌జ్జ‌ల ప‌ట్ల విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ నుంచి స‌జ్జ‌ల‌ను త‌ప్పించాల‌ని పేర్కొంటున్నారు.ఇందుకు కార‌ణం లేక‌పోలేదు.

ఉద్యోగ సంఘాలు స‌మ్మెకు పిలుపు నిచ్చిన స‌మ‌యంలో స‌జ్జ‌ల కారాలు మిర్యాలు దువ్వారు.ఏకంగా వారిని చ‌ర్చ‌ల‌కు పిల‌వాల్సిన అవ‌స‌రం లేద‌ని విరుచుకు ప‌డ్డారు.ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మేన‌ని తెలిపారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌ బ‌డు తుంద‌ని అన్నారు. ఉద్యోగులు ప్ర‌భుత్వంలో భాగ‌మేన‌ని వారు ఎవ‌రిపై ఒత్తిడి తెస్తార‌ని నిప్పురాజేసే వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

ఉద్యోగుల ఉద్య‌మంలో పార్టీలు చొర‌ బ‌డితే ప‌రిస్థితి విష‌మించి ప్ర‌భుత్వ మెడ‌కు చుట్టుకుంటుంద‌ని వెల్ల‌గ‌క్కారు.ఇచ్చిన అవ‌కాశాల‌ను ఉద్యోగులు చేజార్చుకుంటున్నార‌ని, ఉద్య‌మం లోకి పార్టీలు చేరితే ఉద్యోగుల ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తింటాయ‌న్నారు.

ఉద్యోగులే బ‌దిలీలు కోరుతున్నార‌ని, స‌మ్మె నోటీస్‌తో ప్ర‌భుత్వం బ‌దిలీలు ఆప‌ద‌ని, స‌మ‌స్య ప‌ట్ల చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దంటే ఎలా అన్నారు.అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు ఆటంకం క‌లిగిస్తే ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు.

ప్ర‌ద‌ర్శ‌న‌లు, స‌మ్మెల‌తో ఏం సాధిస్తార‌ని అన‌డంతో ఉద్యోగులు భ‌గ్గుమంటున్నారు.సీఎం మెప్పు కోసం స‌ల‌హాదారు స‌మ‌స్య‌ను ప‌క్క‌దోవ‌ ప‌ట్టిస్తున్నాడనే విమ‌ర్శ‌లొస్తున్నాయి.

స‌జ్జ‌ల తీరుతో ప్ర‌భుత్వానికి మ‌చ్చ వ‌చ్చేలా ఉంద‌ని పేర్కొంటున్నారు.

తాజా వార్తలు