యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై సీరియస్ కామెంట్లు చేసిన ప్రియాంక గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్ కామెంట్లు చేశారు.

కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్తత చాలా దారుణంగా రాష్ట్రంలో ఉన్నా గాని ప్రభుత్వం లెక్కలేని తనం గా వ్యవహరిస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.

మేటర్ లోకి వెళ్తే రాష్ట్రంలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ హాస్పిటల్స్ లో అసలు ఆక్సిజన్ కొరత లేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల వ్యాఖ్యానించారు.దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ప్రియాంక గాంధీ.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో .ఆక్సిజన్ కొరత ఉందని, అందువల్లే అనేకమంది ఆసుపత్రిలో జాయిన్ అవలేక పోతున్నారని స్పష్టం చేశారు.ఈ క్రమంలో హాస్పిటల్స్ బయట బెడ్ లు లేక కరోనా పేషెంట్ల కుటుంబీకుల పడుతున్న ఆవేదన మీకు తెలియటం లేదా అంటూ యూపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

హాస్పిటల్స్ బయట కరోనా రోగులు పడుతున్న బాధను వారి కుటుంబీకులు చేస్తున్న ఆర్తనాదాలు .ఒకసారి గమనించాలని వారి స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కి ప్రియాంక గాంధీ తెలియజేశారు.ప్రజలపై బాధ్యత లేకపోతే ఇష్టానుసారంగా ఈ విధంగానే కామెంట్లు చేస్తారు అంటూ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడిన తీరును ఖండించారు.

Advertisement

ఇటువంటి కామెంట్లు చేసినందుకు కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి, కానీ ప్రజల ప్రాణాలను కాపాడండి అని యూపీ ముఖ్యమంత్రిని కోరారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉండటంతో ఇప్పుడు ప్రియాంక గాంధీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు