కోవిడ్‌ను ఎదుర్కోవాలంటే సహకారమే ఆయుధం: ప్రపంచదేశాలకు డాక్టర్ వివేక్ మూర్తి సూచన

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న వేళ ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు దేశాలు పరస్పర సహకారంతో వ్యవహరించాలని సూచించారు భారత సంతతికి చెందిన అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి.

కరోనాతో అల్లాడుతున్న భారత్‌కు అమెరికా బాసటగా నిలిచిందని తెలియజేస్తూ ఆయన పై విధంగా స్పందించారు.

అంతకుముందు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జెక్ సుల్లివన్‌ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో ఫోన్‌లో మాట్లాడారు.ఇటీవల దేశంలో కోవిడ్ కేసులు పెరగడంతో తీవ్ర ఇక్కట్లును ఎదుర్కొంటున్న భారతీయులకు సుల్లీవన్ తన సానుభూతిని తెలియజేశారు.

భారత్‌ ఈ విపత్కర పరిస్ధితి నుంచి బయటపడేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యల గురించి ఆయన అజిత్ ధోవల్‌కు వివరించారు.కోవిడ్‌ను అదుపు చేయని పక్షంలో అది ఎప్పుడైనా, ఎక్కడైనా ముప్పును కలిగిస్తుందని సుల్లీవన్ ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా రోగులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత్‌లోని ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు సాయపడటానికి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లను అమెరికా తక్షణం సరఫరా చేస్తుందని ఆయన ప్రకటించారు.అలాగే అత్యవసర ప్రాతిపదికన ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామాగ్రిని కూడా అందజేస్తామని సుల్లివన్ హామీ ఇచ్చారు.వీటితో పాటు భారత్‌లో టీకా తయారీ సంస్థ బయో-ఈ తన ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు గాను యూఎస్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (డీఎఫ్‌సీ) నిధులను సమకూరుస్తుందని ఆయన వెల్లడించారు.2022 చివరి నాటికి కనీసం ఒక బిలియన్ డోసులను ఉత్పత్తి చేయడానికి బయోఈకి ఈ నిధులు తోడ్పడతాయని సుల్లీవన్ అభిప్రాయపడ్డారు.వీటికి అదనంగా అమెరికా రాయబార కార్యాలయం, భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత్‌లోని ఎపిడెమిక్ ఇంటెలిజెన్స్ సర్వీసులతో కలిసి పనిచేయడానికి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) , యూఎస్ఏఐడీ ప్రజారోగ్య సలహాదారుల నిపుణుల కమిటీని అమెరికా ప్రభుత్వం నియమించింది.

Advertisement

భవిష్యత్‌లో కూడా అమెరికా, భారత్‌లు సన్నిహితంగా వుంటాయని ఇరు దేశాల జాతీయ భద్రతా సలహదారులు పునరుద్ఘాటించారు.

మరోవైపు భారత్‌లో పరిస్ధితి ఆందోళనకరంగా వున్నప్పటికీ అమెరికా ప్రభుత్వం సాయం చేయడానికి ముందుకు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.గోడౌన్లలో మగ్గుతున్న మిగులు టీకాలు, ఇతర వైద్య పరికరాలను భారత్ సహా కోవిడ్‌తో అల్లాడుతున్న దేశాలకు పంపాలని సొంత పార్టీ నేతలు సహా అమెరికాలోని మెజారిటీ వర్గాలు బైడెన్‌పై ఒత్తిడి తెచ్చాయి.దీంతో తప్పనిసరి పరిస్ధితుత్లో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇండియాకు అవసరమైన సహకారం అందిస్తామని అధ్యక్షుడు హామీ ఇచ్చారు.వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన వైద్య సామాగ్రి, ఇతర వస్తువులను భారత్‌కు పంపుతామని జో బైడెన్ ప్రకటించారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు