పాత బిల్డింగ్ పర్రెలు పట్టిన గోడల్లో ప్రైవేట్ చదువులు

నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం పసునూరు గ్రామంలోని సన్ రైజ్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల పరిస్థితి వేలకు వేలు ఫీజులు కట్టి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టుగా ఉంది.

పాత భవనంలో సిమెంట్ ఇటుకలు పేర్చి తరగతి గదులు ఏర్పాటు చేసి,వాటికి కనీసం ప్లాస్టింగ్ చేయకుండా యాజమాన్యం స్కూల్ నడుపుతుంది.

గోడలు పర్రె బాసి ఉండడంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు వస్తే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.అయినా స్కూల్ యాజమాన్యం చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు సరిగా లేవని తల్లిదండ్రులు రెక్కల కష్టంపై ప్రైవేట్ పాఠశాలలకు పంపించి, వేలకు వేలు ఫీజు కడుతుంటే ఇక్కడ అంతకంటే అధ్వాన్నంగా ఉండడం,వర్షాలు గట్టిగా పడితే గోడలు నాని కూలే అవకాశం ఉండడంతో పిల్లలు నిత్యం ప్రమాదంతో సహవాసం చేస్తుండడం గమనార్హం.ఫీజులు వసూలు చేసి చదువు చెప్పే ప్రైవేట్ స్కూల్ ఈ విధంగా ఉన్నా విద్యా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఇప్పటికైనా విద్యా శాఖ అధికారులు నిద్రమత్తు వీడి సన్ రైజ్ ప్రైవేట్ స్కూల్ ను సందర్శించి, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
నకిలీ పత్తి విత్తనాలపై కొరవడిన నిఘా...సుమారు10 ఎకరాల్లో పంటనష్టం

Latest Nalgonda News