బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ ఉపయోగించుకుని ఇతడు వరుస పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టాడు.
మరి అందులో సలార్ ఒకటి.కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సంచలనం సృష్టించిన నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుంది.
ఈయన ఇప్పటి వరకు పోషించని పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు టాక్.ఇక ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.సెప్టెంబర్ 28, 2023న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.
ఇక తాజాగా ఈ సినిమా నుండి ఈ రోజు మేకర్స్ సాలిడ్ పోస్టర్ రివీల్ చేసారు.ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీ కూడా నటిస్తున్నట్టు ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయి.
మరి ఈ వార్త నిజమే అని కన్ఫర్మ్ చేస్తూ.

పృథ్వీ లుక్ కు సంబందించిన పోస్టర్ రిలీజ్ చేసారు.ఈయన క్రేజీ లుక్ ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారిపోయింది.
ఈ లుక్ లో పృథ్వీ నెవర్ బిఫోర్ గా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాలో ఇకనిక క్రూరమైన రోల్ లో వరదరాజ మన్నార్ పాత్ర పోషిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఈయన పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేసారు.ఈ క్రూరమైన లుక్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
మరి నీల్ ఒక్కోపాత్ర రివీల్ చేస్తుంటే ఇంకా అంచనాలు పెరిపోతున్నాయి.దీంతో ఈ సినిమా కోసం ఎదురు చూసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది.