నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి.జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో మాక్లూరు మండలం చిన్నాపూర్ గండి వద్ద జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.

 15 Passengers Were Seriously Injured In A Serious Road Accident In Nizamabad Dis-TeluguStop.com

వరంగల్‌ ఒకటో డిపోనకు చెందిన ఆర్టీసీ బస్‌ను నిజామాబాద్‌ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్ అతివేగంగా వెనుక నుంచి ఢీ కొట్టింది.దీంతో రెండు బస్సుల్లోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.అతివేగమే ప్రమాదానికి కారణమని మాక్లూరు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube