సలార్ నుండి సాలిడ్ పోస్టర్.. ఈ మలయాళ స్టార్ హీరో షాకింగ్ లుక్ రివీల్!

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.

ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ ఉపయోగించుకుని ఇతడు వరుస పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టాడు.

మరి అందులో సలార్ ఒకటి.కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సంచలనం సృష్టించిన నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుంది.ఈయన ఇప్పటి వరకు పోషించని పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు టాక్.

ఇక ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.సెప్టెంబర్ 28, 2023న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఈ రోజు మేకర్స్ సాలిడ్ పోస్టర్ రివీల్ చేసారు.

ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీ కూడా నటిస్తున్నట్టు ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయి.

మరి ఈ వార్త నిజమే అని కన్ఫర్మ్ చేస్తూ. """/"/పృథ్వీ లుక్ కు సంబందించిన పోస్టర్ రిలీజ్ చేసారు.

ఈయన క్రేజీ లుక్ ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారిపోయింది.ఈ లుక్ లో పృథ్వీ నెవర్ బిఫోర్ గా కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో ఇకనిక క్రూరమైన రోల్ లో వరదరాజ మన్నార్ పాత్ర పోషిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఈయన పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేసారు.

ఈ క్రూరమైన లుక్ ఇప్పుడు వైరల్ అయ్యింది.మరి నీల్ ఒక్కోపాత్ర రివీల్ చేస్తుంటే ఇంకా అంచనాలు పెరిపోతున్నాయి.

దీంతో ఈ సినిమా కోసం ఎదురు చూసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది.