ఖమ్మం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు ఖమ్మం జిల్లా జైల్ సూపరిండెంట్ శ్రీధర్ , సబ్ జైల్ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ రోజు రిట్రీట్ – 2022 రెండవ సెషన్ కొనసాగినది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వరంగల్ రేంజ్ డిఐజి జైల్స్ డా.
డి శ్రీనివాస్ , విశిష్ట అతిధులుగ డా .శబరీష్ ఐపియస్ – డిసిపి ఖమ్మం , కుమారి రాధికా గుప్త ట్రైనీ ఐపియస్ లు పాల్గొన్నారు.జైల్ ఉద్యోగులను ఉద్దేశించి డిఐజి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకోవచ్చని , అవసరమైతే నేరుగా తనని కలసి సమస్యను పరిష్కరించుకోవచ్చని , ఉద్యోగులు ఆర్ధికంగా ఎదిగేందుకు డిపార్ట్మెంట్ నుండి సహాయ సహకారాలు ఎల్లప్పూడూ ఉంటాయని , ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు ఉన్నా ఖచ్చితంగ డిపార్ట్మెంట్ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని అలాగే ఉద్యోగులు కూడా డ్యూటీ విషయంలో నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు , తెలంగాణ జైళ్ళు మొదటి స్థానంలో ఉన్నాయని ఇది కేవలం ఉద్యోగుల పనితీరు వల్ల సాధ్యమైనదని ఇది ఇలాగే కొనసాగలని ఉద్యోగుల పనితీరు ఇంకా మెరుగు పరచుకోవాలని సూచించారు .
ట్రైనీ కలక్టర్ రాధిక గుప్త మాట్లాడుతూ పొద్దున తాను ఖమ్మం మహిళా జైల్ ను ఈ రోజు ఉదయం సందర్శించానని గతంలో తాను ట్రైనింగ్ లో భాగంగా తమిళనాడు , ధిల్లీ ల లోని మహిళా జైళ్ళను కూడా సందర్శించానని కానీ ఖమ్మం మహిళా జైల్ రిసార్ట్ లా అహ్లాదకరంగా ఉందని , చాలా పచ్చదనంతో మిగతా రాష్ట్రాల జైళ్ళకన్నా తెలంగాణా జైళ్ళు చాలా బాగుంటాయని అందులో ఖమ్మం జైల్ అహ్లాదకరంగా , ప్రశాంత వాతావరణంలో కాలుష్యం లేకుండా ఉందని దీని వలన ఖైదీల మానసిక పరివర్తనలో తొందరగా మార్పు తీసుకొచ్చేందుకు దోహదపడుతుందని కొనియాడారు .డిసిపి శబరీష్ మాట్లాడుతూ జైళ్ళ శాఖతో మిగతా శాఖలకన్నా మా డిపార్ట్మెంట్ కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయని జైళ్ళ శాఖ ఉద్యోగులకు పని భారం అధికంగా ఉన్నా ఇష్టంతో పని చేస్తారని అందువలన ఖైదీల మానసిక పరివర్తనలో మార్పు తీసుకరాగలుగుతున్నారని అలాగే నేరాల అదుపులో జైల్ ఉద్యోగుల పాత్ర కూడా చాలా కీలకం అని ఇంకా ఎక్కువ కష్టపడి పని చెయ్యాలని , మిగతా రాష్ట్రాల జైళ్ళ కన్నా తెలంగాణా జైళ్ళు చాలా బాగుంటాయని కొనియాడారు .ఇట్టి కార్యక్రమంలో జైల్ సూపరిండెంట్ శ్రీధర్ , సబ్ జైళ్ళ అధికారి లక్ష్మీనారాయణ , జైలర్లు సక్రు నాయక్ , లక్ష్మీనారాయణ , మహిళా సిబ్బంది , వార్డర్లు పాల్గొన్నారు .