ప్రముఖ దర్శకుడు, నటుడు దాసరి నారాయణరావు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన సినీ కెరీర్ లో దాసరి నారాయణరావు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.
ప్రముఖ నటి బొంబాయి పద్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాసరి నారాయణరావు గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఒక దర్శకుడు తను అనుకున్న కథను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చాలా అవస్థ పడతాడని ఆమె చెప్పుకొచ్చారు.
మనం డైరెక్ట్ గా వెళ్లి అడిషన్ ఇస్తే బాగుంటుందని వీడియో పంపడం కంటే అడిషన్ ఇవ్వడం బెటర్ అని బొంబాయి పద్మ అన్నారు.అవకాశాల కోసం నేను నాగబాబు గారి దగ్గరకు కూడా వెళ్లానని ఆమె తెలిపారు.
ఎవ్వరు వచ్చినా నాగబాబు గారు వీలైనంత సహాయం చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.నాకు నాగబాబు గారు సీతామాలక్ష్మి సీరియల్ లో ఛాన్స్ ఇప్పించారని బొంబాయి పద్మ అన్నారు.
దాసరి నారాయణరావు గారు మా అక్కగారి భర్త అని ఆయన మా మామయ్య గారి జేబులో డబ్బులు తీసుకొని సిగరెట్లు కాల్చేవారని ఆమె అన్నారు.దాసరిగారిని నేను కలిస్తే ఆయన సహాయం చేయకపోగా చేదు అనుభవం ఎదురైందని ఆమె తెలిపారు.

నన్ను ఆయన అవమానించారని ఆ అవమానాన్ని నేను చెప్పుకోలేనని ఆమె చెప్పుకొచ్చారు.చనిపోయిన దాసరి నారాయణరావు గురించి ఇంతకు మించి ఏం చెప్పలేనని ఆమె అన్నారు.
చిన్న ఏజ్ లో దాసరి డబ్బులు అలా తీసుకున్నారని అలా చిన్నపిల్లలు ఎవరైనా చేస్తారని ఆమె తెలిపారు.దాసరి డైరెక్షన్ లో మంచి సినిమాలు చేస్తే బాగుంటుందని వెళ్లానని కానీ అందుకు భిన్నంగా జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.
నేను ఎప్పుడూ స్థాయిని పెంచుకోవడానికి ట్రై చేయాలని అనుకుంటానని ఆమె అన్నారు.బొంబాయి పద్మ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







