బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోదీ సీరియస్ వ్యాఖ్యలు..!!

అక్టోబర్ మొదటి తారీకు ప్రధాని మోదీ( Prime Minister Modi ) తెలంగాణలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే.

రేపు మధ్యాహ్నం హైదరాబాద్( Hyderabad ) ఒంటి గంటన్నరకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ కు బయలుదేరనున్నారు.

ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పర్యటనకు సంబంధించి.ప్రధాని మోదీ ట్విట్టర్ లో తెలుగులో ట్వీట్ చేశారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు.ఆ రెండు కుటుంబ పార్టీలే అంటూ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పై తెలంగాణ ప్రజలకు కూడా నమ్మకం లేదు.అసమర్ధ బీఆర్ఎస్( BRS ) పాలనతో ప్రజలు విసిగిపోయారని ట్విట్టర్ నందు విమర్శలు చేశారు.

Advertisement

ప్రధాని మోదీ ట్విట్టర్ నందు తెలుగులో పెట్టిన పోస్ట్."రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను మహబూబ్‌నగర్‌లో( Mahabubnagar ) తెలంగాణా బీజీపీ ర్యాలీలో ప్రసంగిస్తాను.

అసమర్థ బీఆర్‌ఎస్‌ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు.ప్రజలు కాంగ్రెస్‌పై కూడా అంతే అవిశ్వాసంతో ఉన్నారు.

BRS, కాంగ్రెస్ రెండూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేని వంశపారంపర్య పార్టీలు. మహబూబ్‌నగర్‌లో రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను రూ.13,500 కోట్లకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ , రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురుచూస్తున్నాను.ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది" అని స్పష్టం చేశారు.

టెక్సాస్: బీర్ బాటిల్ ఎత్తేసిన చిన్నారి.. ఎలా తాగుతుందో చూస్తే..
Advertisement

తాజా వార్తలు