Salaar Movie : సలార్ దెబ్బకు డుంకీ కూడా వాయిదా పడనుందా.. డైనోసార్ దెబ్బ మామూలుగా లేదంటూ? 

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) నటించిన సలార్ సినిమా( Salaar Movie )ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడింది.ఇలా వాయిదా పడినటువంటి సలార్ డిసెంబర్ 22వ తేదీ విడుదల కాబోతుందని మేకర్స్ అధికారికంగా మరోసారి ప్రకటన విడుదల చేశారు.

 Dunki Going To Be Postponed Because Of Salaar Film-TeluguStop.com

అయితే ఇదే రోజే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్( Shahrukh Khan )నటించినటువంటి డుంకీ ( Dunki ) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి వార్ ఉండబోతుందన్న విషయంపై అటు షారుక్ అభిమానులు ఇటు ప్రభాస్ అభిమానులు కూడా ఈ విషయంపై ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు.

Telugu Salaar, Bollywood, Dunki, Prabhas, Prashanth Neel, Sharuk Khan, Tollywood

ఇప్పటికే పఠాన్ జవాన్ వంటి సినిమాల ద్వారా రెండు బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందుకున్నటువంటి ఈయన చాలా కాన్ఫిడెన్స్ గా డుంకీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే ఇదే సమయానికి ప్రభాస్ సినిమాని కూడా అనౌన్స్ చేయడంతో షారుక్ సినిమా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయని వినపడుతోంది.రాజ్ కుమార్ హిరానీ ( Rajkumar Hirani )దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిన ఈ సినిమాలో సలార్ సినిమాలో ఉన్నన్ని యాక్షన్ సన్ని వేషాలు ఉండకపోవచ్చు ఇప్పటికే సలార్ సినిమా కోసం ఓవర్సీస్ లో భారీగా థియేటర్లు కూడా లాక్ అయ్యాయి.

Telugu Salaar, Bollywood, Dunki, Prabhas, Prashanth Neel, Sharuk Khan, Tollywood

ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ బజ్ కూడా వచ్చింది అందుకే ప్రభాస్ సలార్ సినిమాని నిర్మాతలు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంగా షారుక్ ఖాన్ కి పోటీగా దింపడానికి సిద్ధమవుతున్నారు.అయితే అవతల షారుక్ ఖాన్ 2 వెయ్యి కోట్ల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తగ్గేది లే అంటూ షారుఖ్ ఖాన్ పోటీకి సై అంటున్నారు.ఇక డుంకి సినిమా రిలీజ్ గురించి షారుక్ ఖాన్ పలు సందర్భాలలో మాట్లాడుతూ డిసెంబర్ 22వ తేదీ తప్పనిసరిగా విడుదలవుతుందని చెప్పినప్పటికీ నిర్మాతలు మాత్రం ఎక్కడ ఈ సినిమా విడుదల గురించి మాట్లాడలేదు.

దీన్ని బట్టి చూస్తుంటే డుంకీ సినిమా విడుదల గురించి నిర్మాతలు ఆలోచనలో పడ్డారని బహుశా ఈ సినిమా విడుదలను వాయిదా వేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.అయితే త్వరలోనే ఈ సినిమా విడుదల గురించి మరోసారి మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube