దొంగగా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్..విచారణలో విస్తుపోయే నిజాలు..!

ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్( Software engineer ) చెడు వ్యసనాల బారిన పడి అప్పుల బాధలు భరించలేక చివరికి దొంగగా మారి పోలీసులకు చిక్కాడు.పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

 The Software Engineer Who Became A Thief , Software Engineer , Thief , Srikakul-TeluguStop.com

ఆ దొంగ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

శ్రీకాకుళం( Srikakulam ) లోని కరజాడకు చెందిన బలగ హరిబాబు బీటెక్ పూర్తిచేసి ఢిల్లీ ప్రాంతంలోని గురుగామ్ లో కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేశాడు.అయితే హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ బెట్టింగులు చేయడం ప్రారంభించాడు.

చెడు వ్యసనాలు అధికం అవడంతో ఉన్న ఉద్యోగం కాస్త ఉడింది.

-Latest News - Telugu

అప్పులు అధికమయ్యాయి.డబ్బు సంపాదించడానికి మరో మార్గం కనిపించలేదు.దీంతో శ్రీకాకుళంలోని తన మేనత్త ఇంట్లో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయి జైలు జీవితం కూడా గడిపాడు.

గత నెల 23న విడుదలైన హరిబాబు ఈ నెల 16న అర్ధరాత్రి సమయంలో రాజం పట్టణంలోని శ్రీకాకుళం రోడ్ లో ఉన్న వాసవి నగర్ లో ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఇంట్లో ఏమి దొరకకపోవడంతో తిరిగి వచ్చేసాడు.

-Latest News - Telugu

ఈనెల 18వ తేదీ వాసవి నగర్లోని ఓ ఉపాధ్యాయుడు( Teacher ) ఇంట్లో చోరీ చేసి బయటకి పారిపోయే సమయంలో బయట ఉండే మురికిగుంటలో పడ్డాడు.దుస్తులకు మురికిఅంటడంతో మళ్లీ ఇంటికి వెళ్లి ఉపాధ్యాయుడు వెంకటరమణకు చెందిన ట్రాక్ ధరించి అక్కడి నుండి పారిపోయాడు.చోరీ చేసిన డబ్బులతో ఓ సెల్ఫోన్ కొని, నాలుగు బంగారు గాజులు, ఓ ఆభరణాన్ని విశాఖలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో తనకా పెట్టి వచ్చిన డబ్బులతో జల్సా చేశాడు.

అయితే హరిబాబు దొంగతనం చేసే సమయంలో ఎటువంటి వేలిముద్రలు క్లూస్ టీంకు దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు.తన దగ్గర ఉండే సెల్ ఫోన్ ని కూడా స్విచ్ ఆఫ్ లోనే పెట్టుకున్నాడు.

అయితే ఉపాధ్యాయుడి ఇంటి సమీపంలో విడిచి పెట్టిన ప్యాంట్ ఆధారంగా హరిబాబును విశాఖలో పట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube