ప్రేమ పేరుతో ప్రియురాలిని అడవిలోకి తీసుకెళ్లి....

ప్రస్తుత కాలంలో కొందరు మనుషులు ప్రేమ పేరుతో తమ కామ వాంఛలు  తీర్చుకుంటున్నారు.

తాజాగా ఓ యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నట్లునటించి తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి యత్నించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు ప్రాంతంలో ఓ కాలేజీలో ఓ యువతి చదువుతోంది.అయితే ఈ క్రమంలో ఆ యువతి తన క్లాస్  మేట్ అయినటువంటి ఓ యువకుడిని  ప్రేమించింది.

దీంతో అప్పుడప్పుడు వీరు చెట్టాపట్టా లేసుకొని బయట తిరిగేవారు. అయితే ఓ రోజున ఎంతగానో ప్రేమించిన టువంటి తన ప్రియురాలిపై తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేసేందుకు పన్నాగం పన్నాడు.

ఈ క్రమంలో తన ప్రియురాలిని ఏకంగా ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పార్క్ లోకి  వెళ్లారు. అలాగే ఆమె మాటల్లో ఉంచి పక్కనే ఉన్నటువంటి అడవిలోకి తీసుకెళ్లారు.

Advertisement

అయితే పథకంలో భాగంగా అప్పటికే ఆ యువకుడి స్నేహితులు ముగ్గురు అడవిలోని చెట్ల పొదల్లో వారికోసం ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో ఆ యువకుడు, యువతి రాగానే ఆ యువకుడు మరియు ముగ్గురు స్నేహితులు కలిసి ఆమెపై అత్యాచారయత్నానికి యత్నించారు.దీంతో ఆమె ఒక్కసారిగా కేకలు వేసింది.

ఆ కేకలు విన్న టువంటి ఓ వృద్ధుడు వచ్చి వెంటనే వారిని ఎదిరించాడు.అయితే నలుగురు యువకులు కలిసి ఆ వృద్ధుడిని హత్య చేసే యత్నం చేశారు.

దీంతో ఆ వృద్ధుడు గట్టిగా అరవడంతో అక్కడే కట్టెలు కొట్టే వాళ్ళు వచ్చి ఆ వృద్ధుడిని కాపాడారు.దీంతో నలుగురు యువకులు అక్కడి నుంచి పరుగులు తీస్తుండగా అందులో ఒక యువకుడు స్థానికులకు చిక్కాడు.

దీంతో అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.అలాగే బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు