చిన్న హీరో జారి పోయిన టాప్‌ హీరో చిక్కాడు

విభిన్న చిత్రాల దర్శకుడిగా మంచి పేరును దక్కించుకున్న ప్రవీణ్‌ సత్తారు ఆ మద్య జాతీయ అవార్డును సైతం దక్కించుకున్నాడు.జీవితాలను చూపిస్తాడు అంటూ ఈయనకు పేరుంది.

తాజాగా ఈయన కమర్షియల్‌ చిత్రం ‘గరుడవేగ’తో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.అందుకే ఈయన అవార్డు చిత్రాలకు మాత్రమే కాదు, కమర్షియల చిత్రాలకు కూడా దర్శకత్వం వహించగలడు అనే నమ్మకం సినీ హీరోల్లో వ్యక్తం అయ్యింది.

అందుకే ఈయనతో యువ హీరో రామ్‌ ఒక సినిమాను చేసేందుకు ముందుకు వచ్చాడు.వీరిద్దరి కాంబోలో మూవీకి అంతా సిద్దం అయ్యింది.

సినిమా సెట్స్‌ పైకి వెళ్లబోతుందని భావిస్తున్న సమయంలోనే అందరికి షాక్‌ ఇస్తూ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

Advertisement

ప్రవీణ్‌ సత్తారు మూవీని ఎట్టి పరిస్థితుల్లో లో బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ఆసక్తిని కనబర్చడు.గరుడవేగ చిత్రాన్ని ఏకంగా 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన విషయం తెల్సిందే.రామ్‌తో సినిమాకు కూడా భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేశాడు.

దాంతో నిర్మాత స్రవంతి రవికిషోర్‌ అంత బడ్జెట్‌ తన వల్ల కాదని, 25 కోట్లకు లోపు బడ్జెట్‌తో అయితే చేద్దాం అంటూ సూచించడంతో దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు సినిమాను తాను చేయను అంటూ తేల్చి చెప్పాడు.దాంతో రామ్‌ మరో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ సమయంలోనే ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ఏంటా అంటూ అందరిలో చర్చ జరుగుతుంది.తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ మరియు ప్రవీణ్‌ సత్తారుల కాంబోలో సినిమా రాబోతుందని సమాచారం అందుతుంది.

రామ్‌తో చేయాలనుకున్న ప్రాజెక్ట్‌నే ధనుష్‌తో చేయాలని నిర్ణయించుకున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి మాత్రమేనా.. వరుసగా 8 హిట్లు సాధించారుగా!

గత కొంత కాలంగా తెలుగులో సక్సెస్‌ కోసం ధనుష్‌ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.తమిళంలో ఈయన నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా తెలుగులో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

Advertisement

కాని ధనుష్‌ నటించిన ఒకటి రెండు సినిమాలు మినహా ఏ ఒక్కటి కూడా సక్సెస్‌ను దక్కించుకోలేదు.దాంతో దర్శకుడు ప్రవీణ్‌ సత్తారుతో ఒక డైరెక్ట్‌ తెలుగు సినిమా చేయాలని ధనుష్‌ నిర్ణయించుకున్నాడు.

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రంలో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చిన్న హీరోతో అవకాశం కోల్పోయిన దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌కు తమిళ స్టార్‌ హీరో ధనుష్‌తో సినిమా చేసే అవకాశం దక్కింది.కొన్ని సార్లు కొన్ని ఆఫర్లు కోల్పోతే, అంతకు మించిన ఆఫర్లు దక్కుతాయి అనడంకు ఇదే నిదర్శణం.

తాజా వార్తలు