సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రతిరోజూ పండగే ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా అలరిస్తోంది.
వీకెండ్‌ను పూర్తిగా వినియోగించుకున్న ఈ సనిమా వీక్ డేస్‌లోనూ అదే జోరును కొనసాగిస్తోంది.మారుతి అందించిన కథ బాగుండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.
సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కూడా బాగానే సాధిస్తోంది.ఈ సినిమా 5 రోజులు ముగిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.12.56 కోట్లు కొల్లగొట్టింది.క్రిస్మస్ సెలవు కూడా ఉండటంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
మరో సినిమా రూలర్‌కు దారుణమైన టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకే ఓటేస్తున్నారు.ఇక ఏరియాలవారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 5.37 కోట్లు సీడెడ్ - 1.52 కోట్లు నెల్లూరు - 0.43 కోట్లు కృష్ణా - 0.87 కోట్లు గుంటూరు - 0.87 కోట్లు వైజాగ్ - 1.88 కోట్లు ఈస్ట్ - 0.92 కోట్లు వెస్ట్ - 0.69 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 12.55 కోట్లు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy