బీజేపీ కి దూరంగా కాంగ్రెస్ కు దగ్గరగా ! వైసీపీ పై పీకే వ్యూహం ఫలిస్తుందా ?

ప్రస్తుతం బీజేపీ పై ఏపీ అధికార పార్టీ వైసిపి పీకల్లోతు కోపంతో ఉంది.

తాము ఎంతగా బిజెపి విషయంలో సానుకూలంగా ఉంటున్నా, ఏపీ ప్రయోజనాల విషయంలో బిజెపి గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు వైసీపీ నేతలకు ఆగ్రహం కలిగిస్తోంది.

అయితే కేంద్రంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎప్పటికప్పుడు సర్దుకుపోతూ వస్తున్నా, దాన్ని సాకుగా తీసుకుని తమను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం చాలాకాలం నుంచే జగన్ లో ఉంది.అయితే ఈ వ్యవహారం రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తాయనే ఆందోళనలో ఉన్నా, జగన్ బీజేపీ విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ వ్యవహారాలన్నీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ద్వారా అమలు చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.పార్లమెంట్లో విజయసాయిరెడ్డి హడావుడి చేస్తూ, బిజెపిని ఇరుకున పెడుతుండటం, ఆ పార్టీ పెద్దలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

అయితే వైసిపి ఈ విధంగా వ్యవహరించడానికి కారణం ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహమే అని బజెపి అనుమానిస్తోంది.బీజేపీపై ఆగ్రహంగా ఉంటూ వస్తున్న ప్రశాంత్ కిషోర్ కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

దీనిలో భాగంగా ప్రాంతీయ పార్టీలన్నిటినీ దగ్గర చేస్తూ ఉండటం వంటి పరిణామాలపై ఎప్పటి నుంచో బిజెపి ఓ కన్నేసి ఉంచింది.

అసలు వైసీపీ కి బీజేపీ పై ఇంత ఆగ్రహం కలగడానికి ప్రధాన కారణం ఏపీ లో తమను ఇబ్బందులు పెడుతూ, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న తమ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పై వేటు వేయకుండా, కేంద్రం నాంచివేత ధోరణితో వ్యవహరించడమే కారణంగా కనిపిస్తోంది.

పార్లమెంట్ లో వైసిపి అనుసరిస్తున్న వైఖరి వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లుగా బిజెపి అనుమానిస్తోంది.అంతేకాదు జగన్ కూడా తమ పై కోపం తో కాంగ్రెస్ కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు అనే అనుమానం బీజేపీని కలవరపడుతోందట.ఆ అనుమానం నిజమే అయితే కనుక ప్రశాంత్ కిషోర్ సూచనల ప్రకారం కాంగ్రెస్ కు జగన్ మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు