ఈ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. సత్తా చాటిన భారతీయుడు

ప్రతీ సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా యాపిల్ షాట్ ఆన్ ఐఫోన్ మాక్రో ఫొటోగ్రఫీ ఛాలెంజ్ పోటీలను ప్రారంభించింది.

ఈ పోటీలో పలు దేశాలకు సంబంధించిన వారు పాల్గొనగా.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఇంజనీర్‌ కు ఈ రివార్డ్ దక్కింది.మొదటగా పోటీలను అనౌన్స్ చేసిన షాట్ ఆన్ ఐ ఫోన్.

జనవరి 2022 నుంచి షాట్ ఆన్ iPhone మాక్రో ఫోటోగ్రఫీ ఛాలెంజ్ కోసం ఎంట్రీలను ప్రారంభించింది.ఈ పోటీలో పాల్గొనే వాళ్లు 16 ఫిబ్రవరి 2022 వరకు తమ ఐఫోన్ నుంచి తీసిన ఫొటోలను పంపించాల్సి ఉంటుంది.

ఈ ఛాలెంజ్‌లో కొల్హాపూర్‌కు చెందిన ప్రజ్వల్ చౌగులే Apple ఐఫోన్ మాక్రో ఫోటోగ్రఫీ ఛాలెంజ్‌లోని షాట్‌లో మొదటి పది స్థానాల్లోకి ప్రవేశించగలిగాడు.మిగిలిన 9 స్థానాల్లో చైనా, హంగరీ, ఇటలీ, స్పెయిన్, థాయిలాండ్, అమెరికా వంటి ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు.

Advertisement

పోటీలో మొదటి స్థానాల్లో నిలిచినా వారు తమ ఐ ఫోన్ లో తీసి పంపిన ఫోటోలను Apple తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తోంది.అంతేకాకుండా ఈ ఫోటోలను యాపిల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పలు నగరాలకు సంబంధించిన బిల్‌బోర్డ్‌లలో ప్రదర్శిస్తున్నారు.

ఈ పోటీలో పాలొన్న వారు.వారు తీసే ఫోటోలలో ఐఫోన్ 13 ప్రో మాక్స్ మాక్రో కెమెరా సెన్సార్‌ను హైలైట్ చేయాలి.యాపిల్ ఈ ఛాలెంజ్‌లో, ఫోటోగ్రాఫర్‌లు ఐఫోన్ 13 ప్రో లేదా ఐఫోన్ 13 ప్రో మాక్రో లెన్స్‌తో ఫోటోలను క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ప్రజ్వల్ చౌగులే స్పైడర్ వెబ్‌లో మంచు బిందువులను తన ఐఫోన్ లో క్లిక్ చేసాడు.ఉదయాన్నే ఈ మంచు బిందువులు ముత్యాల్లా కనిపించడంతో ఈ ఫోటోను పోటీలో పంపడానికి నిర్ణయించుకున్నానని అతను తెలిపాడు.

కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!
Advertisement

తాజా వార్తలు