ప్రభాస్ రేంజ్ ఎక్కడ తగ్గట్లేదు..!

రెబల్ స్టార్ ప్రభాస్( Prabha ) రేంజ్ సినిమాకు సినిమాకు పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు.

బాహుబలితో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన ప్రభాస్ ఆ తర్వాత కూడా ఆ మేనియా కొనసాగిస్తున్నాడు.

బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యాం తెలుగులో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కానీ నార్త్ లో బాగానే వర్క్ అవుట్ అయ్యాయి.ఇక లేటెస్ట్ గా ప్రభాస్ చేస్తున్న వరుస క్రేజీ సినిమాలకు బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది.

ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమా ఓవర్సీస్ లో రికార్డ్ ప్రైజ్ పలికింది.అక్కడ సలార్( Salaar ) సినిమాను 90 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారట.

కేవలం ఓవర్సీస్ రైట్స్ 90 కోట్లు అంటే ఇక పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా బిజినెస్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.తెలుగుతో పాటుగా నేషనల్ లెవల్ లో సలార్ దుమ్ముదులిపే బిజినెస్ చేయబోతుంది.ఈ సినిమా తో ప్రభాస్ నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడని చెప్పొచ్చు.

Advertisement

అసలే కె.జి.ఎఫ్ చాప్టర్ 1, 2 చేసి సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ప్రభాస్ ని కూడా అంతకుమించి అనిపించేలా చూపిస్తున్నాడట.కచ్చితంగా సలార్ తో థియేటర్లు షేక్ అవ్వాల్సిందే అంటున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు