'రాధేశ్యామ్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పై క్లారిటీ ఇచ్చిన యూవీ క్రియేషన్స్

ప్రభాస్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11 వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కు సిద్ధం అయింది.

ఈ మధ్య కాలం లో ఏ సినిమాకైనా విడుదలకు నాలుగైదు రోజులు లేదా వారం రోజుల ముందు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే ఈ సినిమా విషయం లో మాత్రం అది జరగదు.ఎందుకంటే ఈ సినిమాకు గతంలోనే భారీ ఎత్తున ప్రీరిలీజ్ నిర్వహించడం జరిగింది.

ఆ సమయం లో జాతీయ మీడియా లో సైతం సినిమా కు సంబంధించిన గురించి చర్చ జరిగింది.మళ్లీ ఆ స్థాయి లో ఈవెంట్‌ ను చేయడం అంటే మామూలు విషయం కాదు.

సంక్రాంతి కి సినిమా విడుదల అవుతుంది అనే ఉద్దేశం తో జాతీయ స్థాయి ఈవెంట్ ను నిర్వహించిన ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉండి పోయారు.ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ల్లో ప్రమోషన్ కార్యక్రమాలు.

Advertisement

మీడియా సమావేశాలు జరుగుతున్నాయి.కానీ భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేదని చేతులెత్తేశారు.

అభిమానులు కూడా మళ్లీ మళ్లీ దూర ప్రాంతాల నుంచి రావడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు.అందుకే చిత్ర యూనిట్ సభ్యులు ఈవెంట్‌ చేయడం లేదని, కానీ భారీ ఎత్తున మీడియా సమావేశాలు నిర్వహిస్తూ చిత్ర హీరో హీరోయిన్ మరియు యూనిట్ సభ్యులు మీడియా తో మాట్లాడటం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు.ప్రభాస్ మరియు పూజాహెగ్డే లతో పాటు రాధాకృష్ణ కూడా హడావుడి చేస్తున్నాడు.10 వేల స్క్రీన్స్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఓపెనింగ్ ఎంత వసూలు చేస్తుంది అనేది ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

Advertisement

తాజా వార్తలు