టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రభాస్ రేంజ్ ఇప్పుడు సూపర్ స్టార్ అనడంలో సందేహం లేదు.అద్బుతమైన సినిమా లను ఆయన చేస్తున్నాడు.
ప్రస్తుతం ఇండియాలో ప్రభాస్ చేస్తున్న సినిమా ల ఖరీదు మరే సినిమా హీరో కూడా అందుకోలేడు అనడంలో సందేహం లేదు.మొత్తం ప్రభాస్ చేస్తున్న సినిమాల విలువ దాదాపుగా అయిదు వేల కోట్లు గా ఉంటుందని అంటున్నారు.
అవి విడుదల అయ్యి భారీ విజయాలను సాధిస్తే వాటి విలువ మరింత గా పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.ఇంతగా సినిమా లు చేస్తున్నా కూడా ప్రభాస్ చాలా సింపుల్ అండ్ స్వీట్ గా ఉంటాడు అనడంలో సందేహం లేదు.
ఆయన నవ్వులో గర్వం కనిపించదు.చిన్న పిల్లాడి మాదిరిగా ఆయన నవ్వు ఉంటుందని నెటిజన్స్ అంటూ ఉంటారు.
తాజాగా ప్రభాస్ ఫొటోలు కొత్తవి సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యాయి.వాటిని జనాలు తెగ వైరల్ చేస్తున్నారు.
సాదారణంగా అయితే హీరోయిన్స్ ఫొటో లు వైరల్ అవుతూ ఉంటాయి.వాటిని నెటిజన్స్ తెగ డౌన్ లోడ్ లు చేసుకుని దాచుకుంటారు.కాని ఇలా హీరో కు సంబంధించినంత వరకు ఫొటోలను షేర్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నెట్టింట జరుగుతున్న ప్రభాస్ ఫొటోల షేరింగ్ లు చూస్తుంటే బాబోయ్ ఒక హీరోకు సంబంధించిన ఫొటోలు మరి ఇంతగా షేర్ అవుతాయా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.మరీ ఇంత దారుణంగా అభిమానులు ప్రభాస్ కు ఉన్నారా అంటూ కొందరు సరదా గా కామెంట్స్ చేస్తున్నారు.ఆదిపురుష్ కు సంబంధించిన ఆ ఫొటోలు చాలా క్యూట్ గా ఉన్నాయంటున్నారు.
ఆది పురుష్ లో ప్రభాస్ ఎలా ఉంటాడు అనేది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.కాని ఆదిపురుష్ కోసం అలా మీసాలు మాత్రం ప్రభాస్ పెంచాడు.చాలా అందంగా ఉన్న మనోడి లుక్ కు బాలీవుడ్ అమ్మాయిలు ఫిదా అవుతున్నారట.