'కల్కి'పై లేటెస్ట్ అప్డేట్.. భారీ సెట్ లో యాక్షన్ సీక్వెన్స్ షూట్!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్( Prabhas )హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD( Kalki 2898 AD ).

పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకుని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇది పాన్ వరల్డ్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం అన్ని ఇండస్ట్రీల స్టార్స్ ను నాగ్ అశ్విన్ తీసుకున్నారు.

ఇప్పటి వరకు ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) దిశా పటానీ, కమల్ హాసన్( Kamal Haasan ) వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.అన్ని ఇండస్ట్రీల వారు ఎదురు చూస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రావాల్సి ఉంది.కానీ సినిమా పనులు పూర్తి అయ్యే ఛాన్స్ లేకపోవడంతో వాయిదా పడనుందని తెలుస్తుంది.

మరి కొత్త రిలీజ్ డేట్ పై కూడా తాజాగా వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా 2024 మే 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.ఇదిలా ఉండగా ప్రస్తుతం షూట్ పూర్తి అయిన పోర్షన్ కు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే మళ్ళీ భారీ యాక్షన్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

Advertisement

తాజాగా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిందిఈ సినిమా ఇంటర్వెల్ యాక్షన్ షెడ్యూల్ అతి త్వరలోనే జరుపుకో నుందట.అందుకే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ ను నిర్మిస్తున్నారని సమాచారం.

ఈ యాక్షన్ సీక్వెన్స్ లోని విజువల్స్ వండర్ఫుల్ గా ఉంటాయట.అంతేకాదు ప్రభాస్ గెటప్ అండ్ సెటప్ మొత్తం ఫ్యాన్స్ కు థ్రిల్లింగ్ కలిగిస్తుందని తెలుస్తుంది.

కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్ నిర్మిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు