జపాన్ లో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే

బాహుబలి సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా ఈ సినిమా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఈ సినిమాని ఇండియాలో ఎంత ఆదరించారో అదే స్థాయిలో జపాన్ ప్రజలు కూడా ఆదరించారు.ఈ ఫిక్షన్ జానపద చిత్రానికి జపాన్ లో విశేష ఆదరణ లభించింది.

అక్కడ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లోకి వెళ్ళిపోయింది అంటే అందులో సుబ్బరాజు పోషించిన పాత్ర పేరుతో కార్టూన్ బొమ్మలు తయారు చేసి మార్కెట్ లోకి తీసుకొచ్చారు.ఆ కార్టూన్ బొమ్మలకి కూడా మంచి డిమాండ్ ఉంది.

ఇక బాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్ కి కూడా జపాన్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.అక్కడ చాలా మంది ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు.

Advertisement

ఇక తమ అభిమాన నటుడు మీద జపాన్ ప్రజలు విభిన్న రూపాలలో ప్రేమని చాటుకుంటున్నారు.కొందరైతే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు.

గతంలో చైనాలో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ఫొటోతో గాజు పాత్రలు తయారు చేసి అమ్మేవారు.కొందరు బాహుబలి సినిమాలోని క్యారెక్టర్ పేర్లతో ఫుడ్ ఐటమ్స్ విక్రయించారు.

ఇక ఇప్పుడు ప్రభాస్‌ పేరిట షుగర్‌లెస్‌ మింట్‌ క్యాండీస్‌ తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు.జపాన్ అభిమానులు ఇలాంటి ప్రయోగాలు చేస్తుండగా, నెటిజన్స్ వారి ప్రేమని చూసి ఆశ్చర్యపోతున్నారు.

మొత్తానికి బాహుబలి సినిమాని జపాన్ మార్కెట్ లో కూడా అన్ని రకాలుగా ఇప్పుడు వాడేసుకుంటున్నారు అని తెలుస్తుంది.అక్కడి ప్రజల క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి మార్కెట్ స్ట్రాటజీలు వాడుతున్నారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు కొత్తిమీర‌తో ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్‌ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.తరువాత మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో, అలాగే హిందీలో ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమాలకి కమిట్ అయ్యాడు.

Advertisement

దీంతో పాటు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ కి ఇప్పటికే ఒక కథ చెప్పినట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు