రాజా ది గ్రేట్ 2 లో ప్రభాస్..?

మాస్ మహరాజ్ హీరోగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ రాజా ది గ్రేట్.

ఈ సినిమాకు సీక్వల్ గా రాజా ది గ్రేట్ 2 సినిమా డిస్కషన్స్ లో ఉంది.

రవితేజ ప్రస్తుతం కమిటైన సినిమాలు పూర్తి చేశాక రాజా ది గ్రేట్ సీక్వల్ ఉంటుందని అంటున్నారు.ఈలోగా అనీల్ రావిపుడి బాలకృష్ణ సినిమా పూర్తి చేస్తాడని తెలుస్తుంది.

ఇదిలాఉంటే రాజా ది గ్రేట్ 2 లో రవితేజతో పాటుగా మరో హీరో కూడా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.అతనెవరో కాదు బాహుబలి ప్రభాస్ రాజా ది గ్రేట్ 2లో నటిస్తాడని టాక్.

ప్రభాస్ ఏంటి రాజా ది గ్రేట్ సీక్వల్ లో నటించడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు.సీక్వల్ కథలో రవితేజకి సపోర్ట్ తా ఓ కెమియో రోల్ రాసుకున్నాడట అనీల్ రావిపుడి ఆ పాత్రకు ప్రభాస్ అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నాడట.

Advertisement

ఎలాగు ఈ సీక్వల్ ని తన బ్యానర్ లో చేసే ఆలోచనలో ఉన్న దిల్ రాజు ప్రభాస్ ని ఒప్పించే బాధ్యత మీద వేసుకున్నారని తెలుస్తుంది.రవితేజ రాజా ది గ్రేట్ 2లో ప్రభాస్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది.

అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు