ప్రభాస్‌ తలకు ఆ పిచ్చి క్యాప్‌ ఎందుకు పెడుతున్నాడు?

యంగ్ రెబల్ స్టార్‌ మిర్చితో టాలీవుడ్‌ లో స్టార్‌ అయ్యాడు.బాహుబలి తో పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ గా మారాడు.

అద్బుతమైన ఫిజిక్‌ కు అమ్మాయిలు ఫిదా అవుతున్నారు.ప్రభాస్‌ హీరోగా నటించిన సాహో మరియు రాధేశ్యామ్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

హీరోగా ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా ల గురించి గల్లీ మీడియా నుండి జాతీయా మీడియా వరకు రెగ్యులర్‌ గా ఏదో ఒక కథనం వస్తూనే ఉంది.ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల సంఖ్య చాలా పెద్దదే.

ఆయన చేయబోతున్న సినిమాలు కూడా భారీగానే ఉన్నాయి.ఇలాంటి సమయంలో ఆయన స్టార్‌ డమ్‌ మరింతగా పెరుగుతుంది.

Advertisement

కాని ఈమద్య కాలంలో ఆయన బయటకు వచ్చిన సమయంలో ధరిస్తున్న క్యాప్‌ విమర్శల పాలు అవుతుంది.తాజాగా నాగ్‌ అశ్విన్ కొత్త ఆఫీస్ ప్రారంబోత్సవం జరిగింది.

ఆఫీస్‌ ప్రారంభోత్సవం కు హాజరు అయిన ప్రభాస్ తలకు ఆ క్యాప్ తో హాజరు అయ్యాడు.ఇంతకు ముందు కూడా ప్రభాస్ అలాంటి క్యాప్ లు దరించాడు.

ఇదేం పిచ్చి క్యాప్‌.ప్రభాస్‌ ఎందుకు ఇలా బయటకు వచ్చిన సమయంలో ఆ క్యాప్ ను ధరిస్తున్నాడు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చెత్త క్యాప్ లో ప్రభాస్ ను చూడలేక పోతున్నాం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరి కొందరు మాత్రం ప్రభాస్ హెయిర్ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

అందుకే అలాంటి క్యాప్ వాడుతున్నట్లుగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ప్రభాస్‌ ను ఇలా చూడలేకుండా ఉన్నాం అంటూ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.

Advertisement

 ముందు ముందు అయినా ప్రభాస్ ఇలాంటి క్యాప్ లో కనిపించవద్దని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.

తాజా వార్తలు