నాలుగోసారి ఆ బ్యూటీకి ఛాన్స్ ఇస్తున్న ప్రభాస్.. మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

స్టార్ హీరో ప్రభాస్ కు జోడీగా నటించే అవకాశం అంటే నో చెప్పేవాళ్లు దాదాపుగా ఉండరనే సంగతి తెలిసిందే.

ప్రభాస్, త్రిష కాంబినేషన్ క్యూట్ కాంబినేషన్ కాగా వర్షం సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ లో తొలి బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు సైతం ఈ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.వర్షం( Varsham )హిట్టయ్యాక ఈ కాంబోలో పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు సైతం వచ్చాయి.

ఈ రెండు సినిమాల కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా ప్రభాస్, త్రిష( Prabhas, Trisha ) కాంబినేషన్ కు మంచి పేరు వచ్చింది.ప్రభాస్ రెమ్యునరేషన్ 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.త్రిష రెమ్యునరేషన్ సైతం 5 నుంచి 7 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

అయితే స్పిరిట్ సినిమా కోసం మరోమారు ఈ జోడీ రిపీట్ కానుందనే వార్త అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.నాలుగోసారి త్రిషకు ప్రభాస్ ఛాన్స్ ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

ప్రభాస్, త్రిష మరోమారు కలిసి నటిస్తే బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరి నిజంగానే ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందో లేదో మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకశాలు అయితే ఉన్నాయి.స్పిరిట్ సినిమా గురించి రూమర్లు రావడం కూడా కొత్తేం కాదు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.స్పిరిట్ సినిమా( Spirit )లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ప్రభాస్ ఎప్పుడూ పోలీస్ ఆఫీసర్ గా కనిపించలేదు.స్పిరిట్ సినిమాతో ప్రభాస్ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

ప్రభాస్ తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఏ రేంజ్ లో అదుర్స్ అనిపిస్తారో చూడాల్సి ఉంది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు