ఇదీ ప్రభాస్ స్థాయి అంటే.. ఆదిపురుష్ మూవీకి ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతోందా?

స్టార్ హీరో ప్రభాస్ ( Prtabhas )సినీ కెరీర్ లో ఊహించని స్థాయిలో విమర్శలు తెచ్చిపెట్టిన సినిమా ఏదనే ప్రశ్నకు ఆదిపురుష్( Adipurush movie ) మూవీ పేరు సమాధానంగా వినిపిస్తుంది.

ఒక దశలో ప్రభాస్ ఈ సినిమాలో ఎందుకు నటించాడో అని ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఫీలయ్యారు.

అయితే ఎక్కడ విమర్శలు వచ్చాయో అక్కడే సత్తా చాటి తన రేంజ్ ను ప్రభాస్ ప్రూవ్ చేసుకున్నారు.ఆదిపురుష్ మూవీ టీజర్( Adipurush movie Teaser ) పై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు.

ఆదిపురుష్ వైజాగ్ హక్కులకు 20 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని ఈ సినిమా నైజాం హక్కులు ఏకంగా 60 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని బోగట్టా.ఈ సినిమా ఆంధ్ర హక్కులు 90 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే అవకాశం ఉందని బోగట్టా.సీడెడ్ హక్కులు సైతం 20 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉంది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమా హక్కుల ద్వారా 170 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

ఆదిపురుష్ మూవీ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినా పాజిటివ్ టాక్ వస్తే ప్రభాస్ మార్కెట్ వల్ల రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధ్యమవుతాయనే సంగతి తెలిసిందే.అందువల్లే ఆదిపురుష్ పై భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి నిర్మాతలు సైతం అంగీకరిస్తున్నారు.ఆదిపురుష్ సంచలనాలు సృష్టించడం ఖాయం అని సోషల్ మీడియాలో సైతం అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేయనుందో చూడాల్సి ఉంది.ప్రభాస్ మార్కెట్ ను డిసైడ్ చేసేది ఈ సినిమానే అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ కు 20 రోజుల సమయం ఉండగా ప్రేక్షకుల నుంచి ఎలాంటి టాక్ వస్తుందో చూడాల్సి ఉంది.ఆదిపురుష్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం
Advertisement

తాజా వార్తలు