ఈశ్వ‌ర్ కి సాహోకి నడుమ ప్ర‌భాస్ రిజెక్ట్ చేసిన 9 సినిమాలు!

ప్ర‌భాస్. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు.

ఈశ్వ‌ర్ తో మొద‌లైన ఆయ‌న సినీ జ‌ర్నీ.ఛ‌‌త్ర‌ప‌తితో స్టార్ హీరోగా ఎదిగాడు.

బాహుబ‌లితో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తుకు చేరాడు.ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ గా గుర్తింపు పొందాడు.

ఈ ప్ర‌యాణంలోనే ఆయ‌న ఎన్నో సినిమాల‌ను వ‌దులుకున్నాడు.అందులో కొన్ని క‌థ‌లు న‌చ్చ‌క రిజెక్ట్ చేయ‌గా.

Advertisement
Prabhas 9 Movies Rejected In Between Eshwar And Sahoo, Prabhas Rejected Mvoies,

మరికొన్ని డేట్స్ కుద‌ర‌క ఒప్పుకోలేదు.ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

దిల్:

Prabhas 9 Movies Rejected In Between Eshwar And Sahoo, Prabhas Rejected Mvoies,

వివి వినాయక్ దిల్ కథని మొదట ప్రభాస్ కి చెప్పాడట.కానీ పెద‌నాన్న కృష్ణంరాజు సలహాతో ప్ర‌బాస్ వ‌దులుకున్నాడ‌ట‌.ఆ తర్వాత ఇదే కథ ఎన్టీఆర్ కి వినిపించాడు వినాయక్.

ఆయ‌న కూడా కొన్ని కార‌ణాల‌తో వ‌ద్ద‌నుకున్నాడు.చివరకు నితిన్ తో చేసాడు.

ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

సింహాద్రి:

Prabhas 9 Movies Rejected In Between Eshwar And Sahoo, Prabhas Rejected Mvoies,
పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

రాజమౌళి సింహాద్రి కథని మొదట ప్రభాస్ తో చేయాలనుకున్నాడు.కానీ సింహాద్రి లాంటి మాస్ స్టోరీని చేయగలడా అనే డౌట్ తో ప్రభాస్ రాజమౌళి కి నో చెప్పాడట.ఈ సినిమా ఎన్టీఆర్ తో చేసి సూపర్ హిట్ కొట్టాక.

Advertisement

రాజమౌళితో ఎలాగైనా సినిమా చేయాలని భావించాడ‌ట ప్రభాస్ .

ఆర్య:

సుకుమార్ డైరెక్షన్లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా చేసిన సినిమా ఆర్య‌.ఈ క‌థ‌ను ప్రభాస్ కు కూడా వినిపించాడ‌ట డైర‌క్ట‌ర్.కానీ క‌థ విన్న ప్ర‌భాస్ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పాడ‌ట‌.

కిక్:

రవితేజ చేసిన సూప‌ర్ మూమీ కిక్ సినిమా కథని.ముందుగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రభాస్ కి చెప్పాడు.కథ నచ్చింది కానీ హీరో క్యారెక్ట‌ర్ త‌న‌కు సెట్ కాద‌ని చెప్పాడ‌ట ప్ర‌భాస్.

బృందావనం:

ప్రభాస్ తో మున్నా సినిమా చేసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తర్వాత కథని కూడా ప్రభాస్ తో చేయాలనుకున్నాడ‌ట‌.కొరటాల శివతో కలిసి వెళ్లి క‌థ‌ చెప్పాడట.కానీ డేట్స్ కుద‌ర‌క ఈ సినిమాను వ‌దులుకున్నాడు.

డాన్ శ్రీను:

బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ క్యారెక్ట‌ర్ న‌చ్చి గోపిచంద్ మలినేని దానిలాగే డాన్ శీను కథని రాసుకున్నాడట.ప్రభాస్ కి ఈ మూవీ చేయాలని ఉన్నా డేట్స్ కుద‌రక నో చెప్పాడ‌ట‌.

నాయక్:

ప్రభాస్ తో చేసిన యోగి సినిమా ప్లాప్ అవడంతో మళ్ళీ ఎలాగైనా ప్రభాస్ కి హిట్ ఇవ్వాలని వివి వినాయక్ అనుకున్నాడ‌ట‌.నాయక్ కథను ప్రభాస్ కు చెప్పాడ‌ట‌.కథ అంత‌గా న‌చ్చని ప్రభాస్ ఈ మూవీకి నో చెప్పాడ‌ట‌.

రన్ రాజా రన్:

కేవలం ప్రభాస్ కోసమే ఈ సినిమా స్టోరీ రాశాడు డైరెక్టర్ సుజిత్.అప్పటికే బాహుబలి లాంటి పెద్ద ప్రాజెక్ట్ కు ఫిక్స్ అయిన ప్రభాస్ ఈ కథని శర్వానంద్ తో చేయమని సుజిత్ కు స‌ల‌హా ఇచ్చాడ‌ట‌.

జిల్:

డైరెక్టర్ రాధా క్రిష్ణ జిల్ సినిమా కథ ప్రభాస్ కు ముందుగా చెప్పాడ‌ట‌.బాహుబలి కార‌ణంగా కుద‌రద‌ని చెప్పిన ఆయ‌న గోపిచంద్ ఈ కథకి బాగా సెట్ అవుతాడని చెప్పాడట.

తాజా వార్తలు