పవర్ స్టార్ ట్యాగ్ తీసేయమన్న పవన్.. బర్త్ డే పోస్టర్స్ సాక్ష్యం..!

పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఫ్యాన్స్ అందరిని ఖుషి చేస్తూ ఆయన చేస్తున్న సినిమాల అప్డేట్స్ వచ్చాయి.

భీమ్లా నాయక్ నుండి టైటిల్ సాంగ్ రాగా.

హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాల నుండి పోస్టర్స్ వచ్చాయి.క్రిష్ డైరక్షన్ లో చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా నుండి కూడా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ పోస్టర్స్ వచ్చాయి.

అయితే ఈ పోస్టర్స్ అన్నిటిలో పవర్ స్టార్ అన్న ట్యాగ్ మిస్సైంది.కేవల హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ అని మాత్రమే పెట్టారు.దీని వెనక కారణం పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది.

పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటున్న పవన్ కళ్యాణ్ తనని పవర్ స్టార్ అని పిలవడం కన్నా పవన్ కళ్యాణ్ అని పిలిపించుకునేందుకే ఇష్టపడుతున్నాడట.అందుకే బర్త్ డే పోస్టర్స్ లో పవన్ కళ్యాణ్ అని మాత్రమే పేరు ఉంచి పోస్టర్స్ వదిలారు.

Advertisement

అయితే ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తిగా ఉన్నా సరే పవన్ కోరిక మేరకే ఇలా పోస్టర్స్ డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.అంతేకాదు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా థమన్ ట్వీట్ చేస్తూ లీడర్ పవన్ కళ్యాణ్ అని కామెంట్ పెట్టడం కూడా చర్చలకు దారి తీస్తుంది.

ఇక మీదట పవర్ స్టార్ ను లీడర్ ట్యాగ్ లైన్ తో పిలుస్తారేమో అని గుసగుసలాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు