బంగాళాదుంప ప్యాక్ తో చర్మ సంరక్షణ ఎంత సులభమో?  

Potato Face Packs-

బంగాళాదుంపలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మినరల్స్,విటమిన్స్ సమృద్ధిగఉండుట వలన చర్మ సంరక్షణలో బాగా సహాయపడుతుంది.ఈ బంగాళాదుంప పాక్స్ అన్నచర్మ తత్వాలకు సరిపోతుంది.బంగాళాదుంప ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.మనరెగ్యులర్ గా వాడుతూ ఉంటాం.అటువంటి బంగాళాదుంప ఉపయోగించి చర్మ సమస్యలనతగ్గించుకుందాం.

Potato Face Packs---

తురిమిన బంగాళాదుంపలో తేనే కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాగోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.

ఒక స్పూన్ బంగాళాదుంప జ్యుస్ లో ఒక స్పూన్ మజ్జిగ,ఒక స్పూన్ శనగపిండి, ఒస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని ముఖానికపట్టించి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాకఆయిలీ స్కిన్ వారికీ బాగా ఉపయోగపడుతుంది.చర్మం యవన్నంగా కన్పించటంలో ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది.

ఒక స్పూన్ బంగాళాదుంప జ్యుస్ లో ఒక స్పూన్ ఎగ్ వైట్, ఒక స్పూన్ పెరుగకలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ముఖం మీద మురికిని తొలగించకాంతివంతంగా మారుస్తుంది.