రాజ్ తరుణ్ కోసం పూజా హెగ్డే.. అనుభవించు రాజా అంటూ?

కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ మొదట్లో వరుస సూపర్ హిట్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే రాజ్ తరుణ్ ఆ తర్వాత నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

ఈ క్రమంలోని రాజ్ తరుణ్ ప్రస్తుతం మంచి సరైన హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రాజు తరుణ్ అనుభవించు రాజా అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సినిమా నవంబర్ 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఎలాగైనా ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత యార్లగడ్డ సుప్రియ ప్రముఖ స్టార్లను రంగంలోకి దింపుతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా టీజర్ విడుదల చేయడానికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేయించారు.

Advertisement

ప్రస్తుతం బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా ఈ సినిమా కోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.నాగార్జున నాగచైతన్య చేతులమీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయించిన సుప్రియ ప్రస్తుతం పూజా హెగ్డే చేతులమీదుగా సెకండ్ సింగిల్ నీవల్లే రా అనే లిరికల్ సాంగ్ విడుదల చేయించారు.

గోపీసుందర్ అందించిన బాణీలకు రమ్య బెహరా ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు.ఇక ఈ పాటను విడుదల చేసిన పూజ హెగ్డే చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు.ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ పీ సంయుక్తంగా నిర్మించారు.

ఈనెల 26వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా పై హైప్ క్రియేట్ అయింది.ఈ క్రమంలోనే ఈ సినిమా పక్కా విజయవంతమవుతుందని చిత్ర బృందం భావించారు.

షియోమి/ రెడ్ మీ మొబైల్స్ లో మీకు పనికివచ్చే 7 రహస్య ట్రిక్స్
Advertisement

తాజా వార్తలు