పవన్ కళ్యాణ్ కు రెండు సార్లు నో చెప్పిన నటి.. ఇప్పుడు అతనితోనే సినిమా?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లు పెద్ద స్టార్ హీరోలతో కలిసి నటించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే అలాంటి అవకాశం ఏ హీరోయిన్ కూడా అవకాశాన్ని వదులుకోదు.

కానీ అలా స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పటికీ ఏకంగా రెండుసార్లు కాదనకుందట మన టాలీవుడ్ బ్యూటీ బుట్ట బొమ్మ పూజా హెగ్డే.ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

పూజా హెగ్డే కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆమె రెండు సార్లు కూడా తిరస్కరించిందట.కానీ పూజా హెగ్డే రెండుసార్లు నో చెప్పినప్పటికీ తనతో కలిసి నటించే అవకాశాన్ని ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే పూజా హెగ్డే కు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కూడా దక్కింది.

Advertisement

ఇక తెలుగులో పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉన్న విషయం తెలిసిందే.అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కలిసి కాంబినేషన్ లో మొదలుకానున్న భారీ ప్రాజెక్టుకు కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.

ఇలా వరుసగా సినిమాల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే.ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చినప్పుడు రెండు సార్లు తిరస్కరించిందట.

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో శ్రుతిహాసన్ పాత్ర మొదట పూజా హెగ్డే కు వచ్చినప్పటికీ చాలా చిన్న అని చెప్పి తిరస్కరించిందట.

అదే విధంగా దర్శకుడు క్రిష్, పవన్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు.ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే.అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ను అనుకున్నారట.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

కానీ ఆ పాత్రకు ఇంపార్టెన్స్ లేదు అన్న కారణంతో పూజా హెగ్డే ఆ అవకాశాన్ని తిరస్కరించిందట.ఇక రెండు సార్లు పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన పూజా హెగ్డే కు మూడో సారి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో అవకాశాన్ని ఇచ్చారట.

Advertisement

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.

" autoplay>

తాజా వార్తలు