'ఆచార్య'లో చరణ్‌ జోడీ పూజా హెగ్డే పాత్ర ఏంటో తెలుసా?

మెగా స్టార్‌ చిరంజీవి హీరోగా కాజల్‌ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసింది.

బ్యాలన్స్ ఉన్న రామ్‌ చరణ్ ఎపిసోడ్‌ ను కూడా షూట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రామ్‌ చరణ్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ కోసం దర్శకుడు కొరటాల శివ పూజా హెగ్డేను కూడా తీసుకు రాబోతున్నాడు.ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సిద్దా కు అత్యంత ఆప్తురాలిగా చిన్నప్పటి నుండి కొనసాగే పూజా హెగ్డే ఆ తర్వాత ప్రేమిస్తుంది.అతడి జీవితం లో భాగం అవ్వడంతో పాటు అతడి కోసం పోరాటం చేస్తుంది.

సినిమాలో పూజా హెగ్డే కనిపించేది కొద్ది సమయమే అయినా కూడా ఆమె ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు.

Pooja Hegde Role In Acharya Movie, Pooja Hegde , Pooja Hegde As Village Girl, Ra
Advertisement
Pooja Hegde Role In Acharya Movie, Pooja Hegde , Pooja Hegde As Village Girl, Ra

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే ఈ సినిమా షూటింగ్ లో ఫిబ్రవరి మొదటి వారంలోనే కనిపించబోతుంది.అందుకు సంబంధించిన షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.పూజా హెగ్డే ఇప్పటికే ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్‌ మరియు అఖిల్‌ తో చేసిన మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్‌ సినిమాలను పూర్తి చేసింది.

త్వరలోనే ఈ సినిమాను కూడా పూర్తి చేయబోతుంది.సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే ఆచార్య సినిమా కోసం 20 రోజుల డేట్లు ఇచ్చిందట.

అందులో అయిదు రోజులు వృదా అవ్వనుండగా 15 రోజుల్లోనే షూటింగ్‌ ను ముగించేయాలని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు.ఫిబ్రవరి చివరి వరకు సినిమాను పూర్తి చేయడంతో పాటు ఏప్రిల్‌ లేదా మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను సాధించిన సినిమాలను అందించిన దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాతో మరోసారి ఘన విజయంను సొంతం చేసుకుంటాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల తో పాటు మెగా అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.

రైల్వే గేటు పడినా ఆగలే.. బైక్‌ని భుజాన వేసుకొని మరీ దూకేశాడు.. వీడియో చూస్తే!
Advertisement

తాజా వార్తలు