Pooja Bhatt: మద్యానికి బానిస అయ్యాను ప్రతిరోజూ మందు తాగుతాను : స్టార్ హీరోయిన్

ఇదివరకటి రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోలు మాత్రమే మద్యాన్ని( Alcohol ) సేవించేవారు.అది కూడా రహస్యంగా సేవించేవారు.

ఈ మధ్యకాలంలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా మధ్యం సేవించడం ఆ విషయాన్ని ఎటువంటి భయం లేకుండా బహిరంగంగానే తెలుపుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఒక స్టార్ హీరోయిన్ తాను మందు తాగుతానని, మధ్యానికి బానిసను అయ్యాను అని చెప్పుకొచ్చింది.

మరి ఆ హీరోయిన్ ఎవరు? అన్న వివరాల్లోకి వెళితే.బాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన మహేష్ భట్ కూతురు పూజా భట్( Pooja Bhatt ) తాను మధ్యానికి బానిసైనట్లు తెలిపింది.

ఈమె బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది.పలు సినిమాలకు దర్వకత్వం వహించింది.అయితే తండ్రి మహేష్ భట్( Mahesh Bhatt ) దర్శకత్వంలో వచ్చిన డాడీ సినిమాలో తొలిసారిగా నటించి మెప్పించింది.

Advertisement

కాగా తాజాగా హిందీలో మొదలైన బిగ్ బాస్ ఒటిటి 2 సీజన్ లో పాల్గొంది.ఈ సందర్బంగా ఆమె పలు సంచలన విషయాలను వెళ్లడించింది.తనకున్న చెడ్డ అలవాట్ల గురించి చెబుతూ తాను మధ్యం తాగుతానని, ఆ అలవాటు రాను రాను వ్యసనంగా మారిపోయిందని తెలిపింది.

అయితే తన 44వ ఏట మధ్యపాన అలవాటును వదిలించుకున్నానని ఆమె తెలిపింది.

అప్పటికే అందరు తనకున్న అలవాటుతో తాగుబోతు అని పిలిచేవారని, కానీ నేను మానేశాను అని చెప్పానని ఆమె చెప్పుకొచ్చింది.ఇలా ఉంటే తాజాగా హిందీలో బిగ్ బాస్ ఓటీటీ 2 సీజన్ తాజాగా ప్రారంభమైన విషయం తెలిసిందే.హిందీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ఓటీటీ ఎట్టకేలకు ప్రారంభమైంది.

ఇకపోతే ఇప్పటికే కొందరు బుల్లితెర వెండితెర సెలబ్రిటీలు ఈ షోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఈ షోకి అజయ్ జడేజా కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు