పొన్నియిన్ సెల్వన్ త్రిషకు ప్లస్ అయినట్టే..!

మణిరత్నం( Mani Ratnam ) డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ సినిమా రెండు పార్టులుగా వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో విక్రం, కార్తీ, జయం రవి నటించగా హీరోయిన్స్ గా త్రిష( Trisha ), ఐశ్వర్యా రాయ్ లు నటించారు.

పార్ట్ 1 ప్రమోషన్స్ టైం లోనే కాదు రీసెంట్ గా పిఎస్ 2 రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా త్రిష మీడియాని ఎట్రాక్ట్ చేసింది.ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్ధాలు అవుతున్నా ఇప్పటికీ త్రిష అదే గ్లామర్ క్వీన్ గా కనిపిస్తుంది.

ఆమె అందం సీక్రెట్ ఏమై ఉంటుందా అని వెతకడం మొదలు పెట్టారు.

పిఎస్ 1, 2 సినిమాల ఫలితం ఎలా ఉంది అన్నది పక్కన పెడితే సినిమా వల్ల లాభ పడ్డది ఎవరు అంటే అది ఒక్క త్రిష అని మాత్రమే చెప్పొచ్చు.త్రిషని సినిమాలో చాలా అందంగా చూపించారు మణిరత్నం.అంతేకాదు ఈ సినిమా వల్ల త్రిషకు కూడా మంచి మైలేజ్ వచ్చిందని చెప్పొచ్చు.

Advertisement

ఇక తన నెక్స్ట్ సినిమా దళపతి విజయ్ తో చేస్తుంది అమ్మడు చూస్తుంటే కోలీవుడ్ లో మళ్లీ త్రిష ఫాంలోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు.పొన్నియిన్ సెల్వన్( Ponniyin Selvan ) ఎవరికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా త్రిషకు మాత్రం మంచి జోష్ ఇచ్చిందని చెప్పొచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు